
రాష్ట్ర ప్రభుత్వ అవార్డు మంత్రి సీతక్క చేతులమీదుగా అందుకున్న మల్లిఖార్జున్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకల సందర్బంగా గత 14 సంవత్సరాలనుండి ఎన్పిఆర్డి ఇండియా ( NPRD INDIA ) రాష్ట్ర అధ్యక్షులుగా వికలాంగుల హక్కుల కోసం పనిచేస్తున్న దైనంపల్లి మల్లికార్జున్ కు తన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సామాజిక సేవ క్యాటగిరిలో మహిళ, శిశు, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి సీతక్క, వికలాంగుల కార్పొరేషన్ గౌరవ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ, వికలాంగుల సాధికారిత శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనిత రామచంద్రన్, స్టేట్ కమిషనర్ బి శైలజ గార్ల చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవ అవార్డు ను అందించారు. కార్యక్రమంలో ఎన్పిఆర్డి ఇండియా ( NPRD INDIA) జాతీయ అధ్యక్షులు రాజేందర్ తుడుం, మహమ్మద్ షఫీ లతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది వికలాంగులు పాల్గొన్నారు.