
- గిరిజనుల చదువుపై ఇంత నిర్లక్ష్యమా..!?
- పేద విద్యార్థులు అంటే అంత అలుసా..!?
- ఐటీడీఏ పీవో, ఉన్నతాధికారులు దృష్టి సారించాలి
- సదరు ప్రభుత్వ టీచర్ పై చర్య తీసుకోవాలి
- అక్రమాలను వెలికి తీసిన జననిర్ణయానికి కృతజ్ఞతలు
- తప్పుడు కేసులు పెడతామనని బెదిరించడం దిగజారుడుతనానికి నిదర్శనం
- డిబీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్
నిరుపేద గిరిజన విద్యార్థులు చదువుకుంటున్న mulugu district ములుగు జిల్లా somlathanda సోమ్లాతండా గిరిజన పాఠశాలలో government teacher ప్రభుత్వ టీచర్ విధులు నిర్వాహణలో నిర్లక్ష్యం, అలసత్వం మూలంగా విద్యావ్యవస్థ కుంటుపడుతుందని dbf దళిత బహుజన ఫ్రంట్ (డిబీఎఫ్) హనుమకొండ జిల్లా అధ్యక్షులు మానసి సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన ములుగులో మాట్లాడుతూ పేద విద్యార్థులు అంటే మరి అంత అలుసా? గిరిజనుల చదువుపై ఇంత నిర్లక్ష్యమా?అని ఆయన మండిపడ్డారు. నిజాలు వెలికి తీసిన jananirnayam “జన నిర్ణయం” పత్రిక విలేకరులను, యాజమాన్యాన్ని తప్పుడు కేసులు పెడతామని బెదిరించడం government teacher ప్రభుత్వ టీచర్ దిగజారుడుతనానికి నిదర్శనమని, వెంటనే వెంటనే ఐటిడిఏ పీఓ ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రభుత్వ టీచర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో dbf డిబీఎఫ్ నాయకులు మోరే ఐలయ్య, మిరుపటి రాజయ్య, కూచిపూడి సత్యం,పోలేపాక మల్లేశం, ధార రమేష్ తదితరులు పాల్గొన్నారు.