
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
- ప్రపంచంలోనే మహోన్నతమైన భారత రాజ్యాంగాన్ని మనువాదుల కుట్రల నుంచి రక్షించుకోవాలని వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు పిలుపు నిచ్చారు. మంగళవారం హన్మకొండ అంబేడ్కర్ విగ్రహాం వద్ద
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహా పరిరక్షణ సమితి అధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవం బండి అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్యెల్యే నాగరాజు అంబేడ్కర్ విగ్రహానికీ పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దేశ మూల వాసులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు, భారత భూమిపై ఉన్న ప్రతీ జీవి, నిర్జీవికి రక్షణ, స్వేచ్ఛ, సమాన హక్కులు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగం ద్వార కల్పించారని తెలిపారు. ఈలాంటి మానవీయ రాజ్యాంగాన్ని మనువాద శక్తులు తమకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకుంటున్నారని తెలిపారు. కుల, మత, రాజకీయాలకు అతితంగా రాజ్యాంగాన్ని కాపాడుకుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెపీటీసీ ఓరం సమ్మయ్య, జర్నలిస్టు సంఘం రాష్ట్ర నాయకులు కంకణాల సంతోష్, డాక్టర్ పుచ్చ లక్ష్మీనారాయణ, న్యాయవాది దండు మోహన్, రిటైర్డు డీఎస్పీ దామెర నర్సయ్య, అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు మిద్దెపాక ఎల్లయ్య, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గ్రేటర్ వరంగల్ కన్వీనర్ పనికల శ్రీనివాస్, మాలమహానాడు నాయకుడు మన్నె బాబూరావు, సాదు కుమారస్వామి, పొనుగంటి లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.