Rome air traffic controllers strike : ప్రపంచ విమానయాన వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషించే వృత్తుల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఒకటి. ప్రతి రోజు వేలాది విమానాలు గగనతలంలో సురక్షితంగా ప్రయాణించేందుకు గగనతల నియంత్రణ కేంద్రాల్లో పనిచేసే ఈ ఉద్యోగులే బాధ్యత వహిస్తారు. విమానాల మధ్య దూరం, ఎత్తు, మార్గం, ల్యాండింగ్ సమయాలు వంటి అనేక అంశాలను సమన్వయం చేయడం వారి ప్రధాన పని. ఈ బాధ్యత అత్యంత ఒత్తిడితో కూడుకున్నది. అందుకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల పని పరిస్థితులు, వేతనాలు, పని గంటలు వంటి అంశాలు తరచూ వివాదాలకు దారి తీస్తాయి. గత నాలుగు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు అనేక ఉద్యమాలు నిర్వహించారు. మొట్టమొదటి సారి 1983లో అమెరికాలో భారీ సమ్మె జరిగింది. అమెరికా తరువాత ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ సమ్మెలు జరిగాయి. నేడు 2026లో ఇటలీలో మార్చి లో జరిగిన సమ్మె వరకు ఈ ఉద్యమాలు విమానయాన రంగంలో ఉద్యోగుల హక్కుల కోసం జరిగిన పోలాటాలే,
Rome air traffic controllers strike
2026 మార్చి 7న ఇటలీ రాజధాని రోమ్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు నిర్వహించిన సమ్మె యూరప్ ట్రాన్స్పోర్ట్ కార్మిక ఉద్యమాల నేపథ్యంలో ప్రాముఖ్యత పొందింది. మార్చి 7న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన ఈసమ్మె ఇటలీ విమానయాన వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశాన్ని కలిగించింది. ముఖ్యంగా రోమ్‌లోని “ఫ్యూమిచినో” అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ఈ సమ్మెతో స్థంభించాయి. ఈ సమ్మెను కేవలం ఒక రంగానికి చెందిన కార్మిక సమ్మెగా మాత్రమే చూడలేం. ఇది ప్రపంచ స్థాయిలో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రంగంలో పెరుగుతున్న పని పరిస్థితుల మార్పులు, నూతన ఆర్థిక విధానాల ప్రభావం, నయా ఉదారవాద విధానాలతో ముడిపడి ఉన్నది.
Rome air traffic controllers strike
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల పని స్వభావం: విమానయాన రంగంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఒక దేశ గగనతలంలో ప్రయాణించే ప్రతి విమానాన్ని సమన్వయం చేయడం వారి బాధ్యత, ఒక్క చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉండటంతో ఈ ఉద్యోగం అత్యంత ఒత్తిడితో కూడుకున్నది. ఇటలీ గగనతలం యూరప్ ప్రధాన మార్గాలలో ఒకటి. యూరప్ నుండి ఆసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా వైపు వెళ్లే అనేక విమానాలు ఇటలీ గగనతలాన్ని దాటుతాయి, అందువల్ల రోమ్‌లో జరిగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమ్మె కేవలం స్థానిక సమస్యగా కాకుండా అంతర్జాతీయ విమాన రవాణాపై కూడా ప్రభావం చూపే అంశంగా మారింది. ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఉద్యోగులు తమ పని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మెకు దిగడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
Rome air traffic controllers strike
సమ్మెకు దారితీసిన కారణాలు: పని భారం పెరగడం, గత దశాబ్దంలో ప్రపంచ విమానయాన రంగం వేగంగా విస్తరించింది. అంతర్జాతీయ పర్యాటకం, వ్యాపార ప్రయాణాలు పెరగడంతో విమానాల సంఖ్య కూడా పెరిగింది. అయితే ఈ పెరుగుదలతో పోలిస్తే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సంఖ్య తగినంతగా పెరగలేదని యూనియన్లు పేర్కొంటున్నాయి. దీంతో ఒక్కో కంట్రోలర్‌పై పని ఒత్తిడి పెరిగింది. ఎక్కువ సమయం దృష్టి కేంద్రీకరించి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రంగంలో శిక్షణ పొందిన సిబ్బంది సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఇటలీలో కొన్ని కంట్రోల్ కేంద్రాల్లో ఖాళీ పోస్టుల్లో కొత్త నియామాకాలు లేవు. ఈ సిబ్బంది కొరత కారణంగా ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు అదనపు షిఫ్టులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు నిరంతర దృష్టి అవసరం. దీర్ఘకాలం పని చేయడం మానసిక ఒత్తిడిని పెంచుతుంది. రాత్రి షిస్టలు, అధనపు పని గంటలు కూడా ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి, మరోపక్క ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో వేతనాలు తగినంతగా పెరగడం లేదు. వేతనాల పెంచాలని యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య జరిగిన వేతన ఒప్పందం చర్చలు సఫలం కాలేదని కార్మిక సంఘాల నాయకులు వాదిస్తున్నారు. యూరప్ కార్మిక ఉద్యమాల నేపథ్యంలో ఈ సమ్మె: ఈ సమ్మెను విస్తృతంగా చూస్తే యూరప్ పెరుగుతున్న కార్మిక ఉద్యమాల భాగంగా చూడాలి. 2026 వివరి నుండి 2026 ప్రారంభం వరకు యూరప్ లో అనేక రంగాల్లో సమ్మెలు జరిగాయి. రైల్వేలు, విమానయాన, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వంటి రంగాలలో కార్మిక అసంతృప్తి పెరుగుతోంది. జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో కూడా ఇదే సమయంలో రవాణా కార్మిక సమ్మెలు జరిగాయి. ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలు పెరగడం, ప్రభుత్వాల కట్టుదిట్టమైన ఆర్థిక విధానాలు వంటి అంశాలు ఈ ఉద్యమాలకు కారణమయ్యాయి.
Rome air traffic controllers strike
2026 మార్చి 7న రోమ్‌లో జరిగిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె ఇటలీ ట్రాన్స్పోర్ట్ రంగంలో కార్మిక అసంతృప్తికి ప్రతిబింబంగా నిలిచింది. పని పరిస్థితులు, వేతనాలు, సిబ్బంది కొరత వంటి సమస్యలు పరిష్కారం కానప్పుడు కార్మికులు సమ్మెలకు దిగడం సహజమే. ఈ సమ్మె యూరప్‌లో పెరుగుతున్న కార్మిక ఉద్యమాల సరళిని కూడా ప్రతిబింబిస్తుంది. ట్రాన్స్పోర్ట్ రంగంలో మారుతున్న పరిస్థితులు కార్మికులపై ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా నయాఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ పోరాటాల్లో అంతీమంగా పెట్టుబడిదారి విధానాలు ఓడిపోతాయి.
యాటల సోమన్న
