
Road safety awareness – warangal district nallabelly mondal నల్లబెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో వరంగల్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆదేశానుసారము జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు రోడ్డు భద్రత, యాక్సిడెంట్లపై పలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా నల్లబెల్లి మండల ఎస్సై వి గోవర్ధన్ మాట్లాడుతు ,ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణం చేసి ఇల్లు చేరుకునే విధంగా చూడాలని సూచించారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తే ప్రమాదవశాత్తు ఏమైనా సంఘటనలు జరిగినట్లయితే ప్రాణాల మీదికి తెచ్చుకునే పరిస్థితి ఉందని, కుటుంబ యజమాని పై కుటుంబం ఆధారపడి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో వాహనదారులు ఎప్పటికప్పుడు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి చట్ట వ్యతిరేకమైన పనులను చేస్తూ కనిపించినట్లయితే వారి గుర్తించి వెంటనే పోలీస్ శాఖకు తెలియజేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, సెల్ఫోన్ మాట్లాడుకుంటూ వాహనం నడపడం లాంటి పరిణామాలకు పాల్పడి రోడ్డు ప్రమాదాలకు బలి కాకూడదని సూచించారు. ప్రతి వ్యక్తి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి మన వ్యక్తిగత సమాచారాన్ని ఎదుటివారికి తెలవకుండా గోప్యంగా ఉంచుకోవాలని సూచించారు. అపరిచిత ఫోన్ కాల్ వచ్చిన వాట్సాప్ లో అపరిచిత మెసేజ్లు వచ్చిన వాటిపై రెస్పాండ్ కాకూడదని తెలిపారు.అతివేగం హానికరమని గుర్తించి వేగంగా వెళ్లకుండా నిదానంగా వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ వేణు, రాకేశ్, శ్రావణ్, బాలు తో పాటు సిబ్బంది ,గ్రామస్తులు వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.