
Oplus_131072
- ఆగని అర్హతకు మించిన ఆర్ఎంపీల వైద్యం దందా…
- కలకలం సృష్టిస్తున్న వైద్య వికటించి ఘటనలు
- తాజాగా వెలుగుచూసిన మరో ఘటన
RMPs’ treatment beyond qualification in Nallabelli : వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ఆర్ఎంపీల వైద్యం కలకలం సృష్టిస్తోంది. అర్హతకు మించిన వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు తాజాగా రుద్రగూడెం కు చెందిన ఓ వ్యక్తికి నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ఓ ఆర్ఎంపీ చేసిన వైద్య ఘటనే సాక్ష్యంగా పలువురు భావిస్తున్నారు. ఆకలి కావడం లేదని ఓ ఆర్ఎంపీ దగ్గరకు వెళ్తే అసలు ప్రాణానికే ముప్పు వచ్చే పరిస్థితి వచ్చిందనే ఘటన ప్రస్తుతం నల్లబెల్లి మండల కేంద్రంలో హాట్ టాపిక్ గా మారిందనేది గమనార్హం. సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆర్ఎంపీలు అర్హతకు మించిన వైద్యం చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఇలాంటి ఘటనలు రుజువు చేస్తున్నాయని పలువురు భావిస్తున్నారు. కొందరు ఆర్ఎంపీలు చేసే అర్హతకు మించిన వైద్యం వల్ల నిస్వార్థంగా ఈ వృత్తిలో కొనసాగుతున్న ఆర్ఎంపీలకు సైతం మచ్చ వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
RMPs’ treatment beyond qualification in Nallabelli
పవిత్రమైన వైద్య వృత్తిలో అర్హతకు మించిన వైద్యం చేసే ఆర్ఎంపీలు చేరి ప్రాణాంతకంగా మారుతుండటం ఆ వృత్తికే కళంకం తెస్తున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే అభిప్రాయాల్లో వాస్తవం లేకపోలేదు. నకిలీ వైద్య పట్టాలు కొనుగోలు చేసి డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. తమకు తెలిసిన అరకొర వైద్యంతో రోగుల ప్రాణాలతో చెడుగుడు ఆడేసుకోవడమే కాకుండా ధనార్జనే ధ్యేయంగా వైద్యం పేరుతో అడ్డగోలుగా రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారని సర్వత్రా చర్చలు సాగుతున్నాయి.
RMPs’ treatment beyond qualification in Nallabelli
మెడికల్ ఫీల్డ్ లో కొన్నేళ్లపాటు అనుభవం సంపాదించిన కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు సొంతంగా క్లినిక్ లు స్టార్ట్ చేస్తున్నారు. వీరిలో కొందరు వైద్యం వృత్తిలో బాగా అనుభవం ఉండి క్రిటికల్ కేసులను సైతం డీల్ చేయగలిగే నైపుణ్యం ఉన్న వారు బీడీఎంఎస్, బీహెచ్ఎంఎస్ వంటి డాక్టర్ పట్టాలు అడ్డదారిలో సంపాదించుకోవడానికి సిద్దపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సమగ్రమైన విచారణ చేపట్టాలని, అర్హతకు మించిన వైద్యం చేస్తూ యధేచ్ఛగా క్లినిక్ లను నిర్వహిస్తున్న ఆర్ఎంపీలపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
- నల్లబెల్లిలో హద్దు మీరుతున్న ఆర్ఎంపీల వైద్యం.. !సమగ్రమైన కథనం “జన నిర్ణయం” రేపటి సంచికలో…