
Oplus_131072
- నల్లబెల్లిలో జోరుగా అక్రమ బియ్యం దందా..!
- అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు…!!
Ration rice racket in Nallabelli : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నదనేది బహిరంగ రహస్యంగా మారింది. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో బియ్యం నిల్వ కేంద్రాలను పెట్టుకొని ఆటోలు, మినీ వ్యాన్లు, బొలేరో వాహనాల్లో నింపి, ఇతర ప్రాంతాలకు తరలిస్తూ తరలిస్తూ అక్రమార్జన చేస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యం అక్రమ దందాపై పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరా అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆహార భద్రత కార్డులు జారీ చేసి వారికి ఆసరాగా ఉండేందుకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నది. పేదల ఆకలి తీర్చాలనే ఆశయంతో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. సివిల్ సైప్లె శాఖలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నదని పలువురు భావిస్తున్నారు.
Ration rice racket in Nallabelli
రేషన్ దందాను అరికట్టడానికి రేషన్ దుకాణాల్లో ఈ పాస్, బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చినా ఫలితం లేకుండా పోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ దందాను అరికట్టాల్సిన సంబంధిత అధికారులు మొక్కుబడి దాడులు చేస్తున్నారే తప్ప నిర్థిష్టమైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని రేషన్ బియ్యం “బాలసంత” చేతుల్లో రేషన్ బియ్యం దందా రెక్కలు విప్పుతుందనేది బహిరంగ రహస్యమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రేషన్ బియ్యం అక్రమ దందాను ఆ మండలంలో సంబంధిత అధికారులు కట్టడి చేయడంలో విఫలమవుతున్నారనే ఆరోపణల్లో నిజం లేకపోలేదు. అధికారులకు ప్రత్యేక దృష్టి సారించి రేషన్ బియ్యం దందాను బాలసంతలో కింగ్ లా రాజ్యమేలుతున్న తతంగం పట్ల ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు భావిస్తున్నారు.