- కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మన్నెం ప్రకాష్ రెడ్డి
జన నిర్ణయం / దామెర
Ramadan is a symbol of religious harmony : పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీల కు రంజాన్ సందర్భంగా ( రంజాన్ తోపా) బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు పెద్ద పీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు రాసమల్ల కిరణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆత్మకూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ దామెర శంకర్ , వార్డ్ సభ్యులు కిన్నెర కోటి , దామెర చేరాలు, తుమ్మనపెల్లి రామేశ్వర్ రావు, కనుకుంట్ల నరేష్ , యూత్ అధ్యక్షుడు పర్హాన్ , పోలు ప్రశాంత్ , సయ్యద్ రబ్బానీ తదితరులు పాల్గొన్నారు.
