
Oplus_131072
- ఇబ్బందులు పడుతున్న బాధితులు..!
- చిత్ర విచిత్రాలు చేస్తున్న పోస్ట్ మాన్..!!
Postman’s Wish : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఓ మండలంలో “పోస్ట్ మాన్” ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల ఫించన్లు పంపిణీ చేయడంలో ఆ పోస్ట్ మాన్ చిత్రవిచిత్రాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మహిళలకు ప్రభుత్వం ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు నెల నెల ఫించన్లు ఇస్తుంటే వాళ్ళ పెన్షన్ డబ్బులను అందించడంలో సదరు పోస్ట్ మాన్ మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమయానికి పెన్షన్లు ఇవ్వకుండా, వృదులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒంటరి మహిళలకి కూడా వేధింపులు తప్పడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒంటరి మహిళలకి నెల నెల పెన్షన్ రావాలి అంటే సదరు పోస్ట్ మాన్ అనుకుంటే తప్ప పెన్షన్ దారులకు అందే పరిస్థితి లేదని పలువురు వాపోతున్నారు. తన మాట వినకుంటే, పెన్షన్ రాకుండా చేస్తానంటూ సదరు పోస్ట్ మాన్ హూకూం జరిచేస్తాడనే ఆరోపణలు లేకపోలేదు. పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇస్తే ఒక లెక్కా, తనదగరికి వచ్చి తీసుకుంటే ఒక లెక్కా అనే తరహాలో సోదరు పోస్ట్ మాన్ చిత్రవిచిత్రాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
*******
ఎవరా పోస్ట్ మాన్..? ఏ మండలం..? పెన్షన్ ఆలస్యంగా ఇవ్వడానికి కారణాలేంటి..?పర్సనల్ గా ఒక్క ముఠాతో……….చేస్తున్న దందాలు ఏమిటి..? సదరు పోస్ట్ మాన్ జారీ చేసే హుక్కూంల చిత్రాతివిచిత్రాల లీలల సమగ్రమైన కథనం మరో సంచికలో…..