
- హనుమకొండ జిల్లాలోని ఓ స్టేషన్ లో విచిత్ర ఘటన..!
- చితకబాది కాంప్రమైజ్ అన్న వైనం..!!
- ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన…
- ఆ ఘటనపై మండలంలో వ్యాపిస్తున్న గుసగుసలు…
- అకారణంగా చితకబాది “సారీ” చెప్పినట్లు ప్రచారం…
- ఆ పోలీస్ అధికారి తీరుపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పలువురు…
Police officer overreacts to a young man : “సరిపోదా శనివారం” సినిమా అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో పోలీస్ అధికారికి కోపం వస్తే ఓ ఊరి జనం మీద ప్రతాపం చూపించి ఆ కోపాన్ని తీర్చుకుంటాడు. ఇది సినిమాలోని సన్నివేశాలు. కానీ ఇక్కడ ఇదే తరహాలో ఓ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. కాకపోతే సరిపోదా శనివారం అన్నట్లు కాకుండా ఇక్కడ శుక్రవారం ఘటన జరుగటం గమనార్హం. ఆ పోలీస్ అధికారికి ఎందుకు కోపం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఓ యువకుడిని తమ పోలీసు వాహనంలో పడేసి పిడిగుద్దులతో చితకబాదినట్లు సమాచారం. ఆ యువకుడు చేసిన నేరం ఏంటంటే ఎలక్ట్రానిక్ స్కూటీ పై ఆ పోలీస్ అధికారి అడ్డా వేసిన వాహనానికి ఎదురు పడటమే. డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసినప్పటికీ ఎలాంటి రిజల్ట్ లేదు. వాహనాన్ని చెక్ చేశారు ఏం లేదు. అయినప్పటికీ ఆ అధికారికి ఎందుకు కోపం వచ్చిందో ఏమో తెలియదు. తన “ఖాకీ” ప్రతాపాన్ని చూపించినట్లు సమాచారం. పోలీసు వాహనంలో ఆ యువకుడిని సుమారు రెండు గంటలు ఆయా గ్రామాలు తిప్పి చివరికి మళ్లీ మనస్సు మారిందో ఏమో స్టేషన్ లోని తన నివాస గృహానికి తీసుకెళ్ళి “సారీ” చెప్పి కాంప్రమైజ్ కావడం విచిత్రమైన సంఘటనగా ఆ మండలంలో చర్చలు సాగుతున్నాయి. ఈ ఘటన సరిపోదా శనివారం పోలీసు అధికారిని గుర్తు చేస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాకపోతే సరిపోదా శనివారం సినిమాలో ఆ పోలీస్ అధికారి “సారీ” చెప్పే ప్రసక్తే ఉండదు. ఇక్కడ “సారీ” చెప్పాడు అంతే తేడా. ఇది హనుమకొండ జిల్లాలోని ఓ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఘటన. ప్రస్తుతం ఆ “ఎస్ఐ” వ్యవహరించిన తీరు చాపకింద నీరులా చర్చానీయాంశంగా మారుతోందనేది గమనార్హం. పోలీసులు ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.