Pattipaka Sub-Sarpanch unanimously తాజాగా జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామ ఉపసర్పంచ్ ఏకగ్రీవం అయింది. మొత్తం 12 వార్డులు ఉండగా 7 బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో 4వ వార్డు సభ్యునిగా గెలుపొందిన తుడుం రాజు ఉపసర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ రాజు మాట్లాడుతూ ఉప సర్పంచ్ కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
