
Oplus_131072
- “అన్న” వెంటే “తమ్ముడు”..!?
- పంచాయతీ రాజ్ చట్టాన్ని చుట్టంగా మార్చుకున్న ఆ అధికారి..
- పంచాయతీ సొమ్ము చూట్టానికి పంచుతున్న ఘనుడు…
- అన్న ఎక్కడ ఉంటే తమ్ముడు అక్కడికి బదిలీ ఇవ్వాల్సిందే..!
- మల్టీ పర్పస్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ పేరుతో నెల నెల జీతం…!?
- ఎమ్మెల్యే మావోడే అంతా మా ఇష్టం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు అధికారిపై ఆరోపణలు…
Panchayati raj act is applicable to that officer : అన్న” వెంటే “తమ్ముడు”. అన్న ఎక్కడ ఉంటే తమ్ముడు అక్కడికి బదిలీ ఇవ్వాల్సిందే. పంచాయతీ సొమ్ము చూట్టానికి పంచుతున్న ఆ ఘనుడు ఎమ్మెల్యే మావోడే అంతా మా ఇష్టం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు అధికారిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. మల్టీ పర్పస్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ పేరుతో నెల నెల వేతనాన్ని అన్న పలుకుబడితో తమ్ముడు పొందుతున్నాడనే ప్రచారంలో నిజం లేకపోలేదు. దీంతో ఆ అధికారికి పంచాయతీ రాజ్ చట్టం చుట్టంగామారిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన ఓ మండలంలోని అధికారి ఘనకార్యంగా ప్రచారం సాగుతోంది.
************
Panchayati raj act is applicable to that officer
అవినీతి అక్రమాల నుంచి పంచాయతీలను కాపాడడం కోసం, పల్లెలను అభివృద్ధి పదంలో నడపడం కోసం, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం 2018ని చాలా పకడ్బందీగా అమలు చేస్తుంది. అవినీతి అక్రమాలలో అరితేరిన కొందరు అధికారులు ఆ చట్టాన్ని పక్కన పెట్టి తమ చుట్టాల పొట్ట నింపే పనిలో పడ్డారనే ఆరోపణలు పెరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని ఓ మండలంలో కొన్నేళ్లుగా మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహించి గత సంవత్సరం బదిలీల్లో భాగంగా అదే నియోజకవర్గంలోని మరో మండలానికి బదిలీ అయి నిన్నగాక మొన్న ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఆ అధికారి తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తన తమ్ముడిని బదిలీపై తీసుకు వెళ్తూ ఆ తమ్ముడికి ఎటువంటి నియామక పత్రాలు లేకుండా, పంచాయతీరాజ్ చట్టం జీవో నెంబర్ 51 తుంగలో తొక్కుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం గ్రామపంచాయతీ గాని, గ్రామసభ గాని ఆమోదం లేకుండానే తనకిష్టం వచ్చినట్లు ఎంపీడబ్ల్యుగా లేదా, కంప్యూటర్ ఆపరేటర్ గా నెలనెలా జీతాలు చెల్లిస్తూ అవసరమనుకుంటే ఒకే నెలలో రెండు దాఫాలుగా ఇటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుండి అటు పిఎఫ్ఎంఎస్ నుండి జీతాలు చెల్లిస్తూ “అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు” అనే సామెతను తలదాన్నే విధంగా జీతాలు చెల్లిస్తూ ప్రజల సొమ్మును అప్పన్నగ మెక్కెస్తున్న ఘనుడి వ్యవహారం జోరుగా ప్రచారం సాగుతోంది.
Panchayati raj act is applicable to that officer
అవినీతిలో ఆరు తేరి ‘చైతన్’ పరుడైన అధికారి ఆ అవినీతి సొమ్ము వసూళ్లకు తన తమ్ముడి సహకారం అవసరమని భావించి తన తమ్ముడిని నియమించుకొని మండలంలోని ఏదో గ్రామపంచాయతీ నుండి నెలనెలా జీతాలు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తమ వాడేనని తమరిని ఎవరు ఏం చేయాలేరని కింది స్థాయి అధికారులపై ఆ అధికారి, ముల్టీపర్పస్ వర్కర్లపై తన తమ్ముడి యాజమానిషీని కొనసాగించడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అతని తమ్ముడు నియమకానికి సాక్షాత్తు ఎమ్మెల్యే గారే సిఫారస్ చేయడం విమర్శలకు తావిస్తోంది. అయితే ఎమ్మెల్యే సిఫారసు ఉంటే పంచాయతీల్లో నియామకాలు చేపట్టవచ్చా…! ఎమ్మెల్యే రికమండేషన్ ఉంటే పంచాయతీరాజ్ చట్టం 2018 నియమ నిబంధనలు వర్తించవా..! అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ అవినీతి అధికారి అక్రమాల చిట్టా అంతులేని కథలా ఉందనే వాదనలు లేకపోలేదు.