
Panchayat Secretary dies in road accident విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న పంచాయతీ కార్యదర్శి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై ఎం.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి చెందిన కొర్ర వెంకట్రావు (55), మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం తన విధులు ముగించుకుని తన ద్విచక్రవాహనంపై సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో సాయంత్రం 4:45 గంటల సమయంలో నెక్కొండ మండలంలోని రక్మి తండా శివారులోకి రాగానే ఎదురుగా రామనబోయిన శివశంకర వరప్రసాద్ అనే వ్యక్తి పల్సర్ మోటార్‌సైకిల్‌ను అతివేగంగా,అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి వెంకట్రావు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఆయన రోడ్డుపై పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతుని కుమారుడు కొర్ర వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.