
- నల్లబెల్లి “పిఎసిఎస్”ను స్వంత ఆస్తిగా మలుచుకున్న ఘనులు..!
- రైతు రుణాలు కొల్లగొట్టిన శాశ్వత చర్యలు శూన్యం..!!
- పలువురు బాధితరైతులకు దక్కని న్యాయం…
- ఛైర్మన్ గుప్పిట్లో కీలుబొమ్మగా మారిన నల్లబెల్లి ‘పిఎసిఎస్”…
Pacs irregularities : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం “పీఏసీఎస్”లో గతంలో జరిగిన అక్రమాల భాగోతం బహిరంగ రహస్యమే. ఆ “పీఏసీఎస్” “చెట్టు”కింద పలువురు రైతులు నలుగుతున్నారు. నల్లబెల్లి “పిఎసిఎస్”ను స్వంత ఆస్తిగా మలుచుకున్న ఘనులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల్లో నిజం లేకపోలేదు. అయితే యధేచ్ఛగా రైతు రుణాలు కొల్లగొట్టినప్పటికీ శాశ్వత చర్యలు శూన్యంగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనేక పరిణామాల నేపథ్యంలో పలువురు బాధితరైతులకు నేటికీ న్యాయం దక్కలేదని పలువురు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఛైర్మన్ గుప్పిట్లో కీలుబొమ్మగా నల్లబెల్లి ‘పిఎసిఎస్” మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదేంటని ప్రశ్నిస్తే ఎదురుదాడిచేసి నోరు మూయించేందుకు సదరు ‘చెట్టు”అన్నిరకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నారనేది బహిరంగ రహస్యంగా మారింది.