
- “రిటైర్డ్ హెచ్ఎం” ను సన్మానించిన పూర్వ విద్యార్థులు
- జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న 2002-2003 బ్యాచ్ విద్యార్థులు
- రిటైర్మెంట్ తీసుకున్న హెచ్ ఎం ను సత్కరించిన పూర్వ విద్యార్థులు
Warangal deshaipet వరంగల్ దేశాయిపేటలోని ప్రభుత్వ సహాయక నెహ్రూ మెమోరియల్ స్కూల్ లో రెండు దశాబ్దాల కిందట 10వ తరగతి చదువుతున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా కలుసుకున్నారు. 2002-2003లో 10వ తరగతి పూర్తిచేసుకున్న తమ స్కూల్ హెచ్ఎం రిటైర్మెంట్ తీసుకున్న సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు రిటైర్డ్ హెచ్ఎం వద్దిరాజు వెంకటేశ్వర్రావును ఆదివారం సన్మానించారు. వివిధ హోదాల్లో ఉన్న 2002-2003 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యా ర్థులు పాఠశాలకు వచ్చి వెంకటేశ్వర్రావు దంపతులకు పూలమాలలు వేసి, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. 2002-2003పదో తరగతి వరకు చదివిన విద్యార్థులు 21 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలుసుకుని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చదివిన బడి, పరిసరాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిల్లో ఉన్నామని తెలిపారు. ఈ సదర్భంగా తమకు పాఠాలు చెప్పిన గురువు హెచ్ఎం గా రిటైర్మెంట్ తీసుకున్న సందర్భాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గిరిధర్, కేఎంసీ డాక్టర్ ప్రియదర్శిని, సతీశ్, పృథ్వీ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.