
2011-12 10th బ్యాచ్ అపూర్వ కలయిక
Warangal district వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2011 -12 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.