
- హనుమకొండ మండలంలో ఉన్న మెలోహ జూనియర్ కాలేజీ కాజీపేటకు ఎలా మారింది..?
- ఓకే కాంప్లెక్స్ లో పాఠశాల జూనియర్ కాలేజీ నిర్వహిస్తున్న యజమాన్యం..
- మెలోహ జూనియర్ కాలేజీ క్షేత్రగా ఎలా మారింది..?
- ఫైర్ సేఫ్టీ లేని కాంప్లెక్స్ లో ఎలా అనుమతి ఇచ్చారు?
- రెన్యువల్ టైంలో ఇవన్నీ ఏం పట్టించుకోని డిఐఈఓ
- చూసి చూడనట్టు ఉండడానికి కారణాలేంటి..?
Officials’ support for field college : హనుమకొండ జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. హనుమకొండలో ఉన్న కాలేజీ ఖాజీపేట మండలానికి మార్చడానికి పెద్ద ఎత్తున రహస్యపు ఒప్పందాలు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హనుమకొండ మండలంలో ఉండే మెలోహ జూనియర్ కాలేజ్ కాజీపేట మండలం ఎలా మారిందనేది ఇక్కడ ప్రశ్న. ప్రస్తుతం అదే కాలేజీనీ క్షేత్ర జూనియర్ కాలేజీ పేరుతో నడిపిస్తుండటం గమనార్హం . జూనియర్ కాలేజీతో పాటు అదే భవనంలో పాఠశాల కూడా యజమాన్యం నిర్వహిస్తుంది.
Officials’ support for field college
క్షేత్ర కాలేజీ పేరు మార్పిడి సందర్భంలో ఎలాంటి పత్రాలు పరిశీలించకుండా కనీసం ఫైర్ సేఫ్టీ కూడా లేని భవనంలో మెలోహా గా ఉన్న జూనియర్ కాలేజీనీ క్షేత్ర జూనియర్ కాలేజీగా మార్చినప్పుడు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు నిబంధనలు పాటించకుండా క్షేత్ర జూనియర్ కాలేజీకి అనుమతులు ఎలా వచ్చారని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇష్టం వచ్చిన ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులను అనేక రకాల ప్రలోభాలకు గురిచేస్తూ ఐఐటి, నీట్ ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తు విద్యా వ్యాపారం సాగుతుంటే నియంత్రించాల్సిన అధికారులే వారికి అండగా ఉంటున్నట్లు హనుమకొండ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులను చూస్తే అర్థమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Officials’ support for field college
మరోవైపు అనేక జూనియర్ కాలేజీలు అప్లికేషన్స్ ఇంటర్ జిల్లా విద్యాశాఖ అధికారి రెన్యువల్ చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా క్షేత్ర జూనియర్ కాలేజీ పట్ల విచారణ చేపట్టి అనుమతులు రద్దు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.