
Oplus_131072
- అక్రమ నిర్మాణాలకు అధికారుల అభయహస్తం
- వారు రాసుకోనివ్వండి…మేం చూసుకుంటాం..!
- అక్రమ నిర్మాణదారులకు అభయమిస్తున్న “టౌన్ ప్లానింగ్” అధికారులు
- కాసులకు కక్కుర్తి పడి నోరు మెదపని టౌన్ ప్లానింగ్ అధికారులంటూ ఆరోపణలు
- అనుమతులకు ఓ రేటు… అక్రమ అంతస్తులకు మరో రేటు అనే ప్రచారం
- వైభవ్ ప్లాజా పై కమిషనర్ గారూ చర్యలు ఎప్పుడు తీసుకుంటారు..?
- చక్రం తిప్పుతున్న ఓ జాతీయ కమిషన్ సభ్యుని వ్యక్తిగత సహాయకుడు..! officials’ protection for illegal constructions : హనుమకొండ హంటర్ రోడ్ లో నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్ గా ఉపయోగిస్తూ అనుమతి తీసుకున్న దానికంటే అదనంగా రెండు అంతస్తులు నిర్మించి కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టారని కార్పొరేషన్ అధికారులకు తెలిసిన వ్యక్తిగత ఆదాయానికి కక్కుర్తి పడి నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అధికారులకు అనుమతులకు ఒక రేటు, అదనపు నిర్మాణానికి ఒక రేటు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. వార్తలు రాసుకొనియండి అంత మేము చేసుకుంటామని వైభవ్ ప్లాజా యజమానికి అధికారులు హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం అంతా ఓ జాతీయ కమిషన్ సభ్యుని వ్యక్తిగత సహాయకుడు నడిపిస్తూ వైభావ్ ప్లాజాకు అన్ని తానై అండగా ఉంటున్నాడని ప్రచారం జరుగుతుంది. అక్రమ నిర్మాణాలపై ఉపేక్షించేది లేదని చర్యలు తీసుకుంటామని మున్సిపల్, కమిషనర్, అధికారులు గొప్పలు చెప్తున్నా…వారికి వైభవ్ ప్లాజా కనిపించడం లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మున్సిపల్ అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారని పలువురు భావిస్తున్నారు. వైభవ్ ప్లాజా విషయంలో కమిషనర్ అయిన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే..?