O Gurudev of the Gurus..! (Poetry of praise) :
సారూ.. మా రాజారాం సారూ..
వేల వేల వందనాలు మీకు
సారూ.. ఓ రాజారాం సారూ..
అభినందన చందనాలు మీకు-2
// సారూ//1
స్నేహానికి మీరే ప్రాణ సమానం
మా అందరికీ మీరే ఓ బంధు గణం
చిరునవ్వుకు మీరే స్వచ్ఛని రూపం
మంచికి మీరే ఓ ప్రతి రూపం
// సారూ//1
అక్షరమే మీ శ్వాస
అక్షరమే మీ ధ్యాస
మా అడవి బిడ్డలకు
మీరే అండా దండా
సరస్వతీ పుత్రుడా
సమరశీల ధీరుడా
గురుకుల గురు దేవుడా
గిరిపుత్రుల ఆరాధ్యుడా // సారూ//1
నర్సాపూర్ నుండి కొండాపూర్ దాకా
ఖండాంతరాలకు వ్యాపించెను మీ శిష్యుల కీర్తి
గురుతర బాధ్యతగా గురుకులాలకు వన్నె తెచ్చావు
సాటి లేని మేటి ప్రధాన గురువుగ నిలిచావు
కొలువు కుదిరిన ఈ రజతోత్సవ వేళ
సంబరమే అంబరముగా
జాతిని జాగృత పరచగ
సాగిపో ముందుకు విద్యా జ్యోతిగ
// సారూ//1
O Gurudev of the Gurus..! (Poetry of praise)
(కొండాపూర్ గిరిజన బాలుర గురుకుల ప్రిన్సిపల్ శ్రీ ఎం. రాజారాం గారు ఉపాధ్యాయ వృత్తి రజతోత్సవ వేడుకల నేపథ్యంలో…)
రచన : ఏముల నర్సిములు
టీజీటీ తెలుగు పీటీ, కొండాపూర్
