
- రవాణాశాఖలో ఆ “ఏంవీఐ” ఓవర్ కాన్ఫిడెన్స్..!?
- “శోభన్” బాబు నటనకు వరంగల్ ఆర్టీఏ కార్యాలయం దాసోహం..!!
No problem even if the collector knows : “వరంగల్ రవాణాశాఖలో “శోభన్” బాబు నటకీరీటికి అవార్డు ఇవ్వాల్సిందే. యధేచ్ఛగా ప్రయివేటు అసిస్టెంట్లను నియమించుకుంటాం… అదనపు వసూళ్లకు తెగబడుతాం… వాహనదారుల జేబులను గుళ్లా చేస్తాం…అంతా మా ఇష్టం. కదిలించే వారే లేరు. కలెక్టర్ కు తెలిసినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఆ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది అంతా తమ వాళ్లే. ఇదీ వరంగల్ ఆర్టీఏలో ఎంవీఐ ఓవర్ కాన్ఫిడెన్స్”.
No problem even if the collector knows
వరంగల్ రవాణాశాఖలో జరుగుతున్న అక్రమ వసూళ్లపై, దానికి సంబంధించి ఓ ఏంవీఐ శోభన్ బాబును మించిన నటనపై “జన నిర్ణయం” వరుస కథనాలు అందించిన విషయం తెలిసిందే. అయితే ఇట్టి అంశంలో డిటిసికి తెలిసినా… ఏకంగా జిల్లా కలెక్టర్ కు తెలిసినా నో ప్రాబ్లమ్ అంటూ సదరు ఎంవీఐ ఓవర్ కాన్ఫిడెన్స్ తో అంతకంటే ఎక్కువగా దూకుడు పెంచినట్లు కార్యాలయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రయివేటు అసిస్టెంట్లకు మరింత భరోసా ఇస్తూ వసూళ్ల పర్వాన్ని పెంచడం గమనార్హం.
No problem even if the collector knows
అయితే విధుల పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న “ఆర్టీవో” గందం లక్ష్మీని ప్రభుత్వానికి సరెండర్ చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రస్తుతం అక్రమ వసూళ్ళను ప్రోత్సహిస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆర్టీఏ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఇంఛార్జి డిటివో వ్యవహారం పట్ల ఎలాంటి చర్యలు చేపడుతారో వేచిచూడాల్సిందే… !