
- నగరం నడిబొడ్డున బరితెగింపు…!
- యధేచ్ఛగా మెడికల్ షాప్ ముసుగులో జనరిక్ మందుల దందా..!?
- అమాయకులను దోచుకుంటున్న” కేర్ ప్లస్ ఫార్మసీ” మెడికల్ యాజమాన్యం….
- వారికి పొలిటికల్ పవర్ ఉందనే ఓవర్ కాన్ఫిడెన్స్…
- తమను ఎవరేం చేయలేరనే ధీమాతో కేర్ ప్లస్ ఫార్మసీ లో జనరిక్ మందులను అమ్ముతూ అధిక మొత్తంలో కొల్లగొడుతున్న నిర్వాహకులు
Negligence of drug officials : అక్కడంతా బహిరంగ రహస్యమే. డ్రగ్స్ అధికారుల కనుసన్నల్లోనే అంతా జరుగుతోంది. ఇక అడిగే నాధుడు ఎవరు..? వారు ఆడిందే ఆట పాడిందే పాట. వెరసి ఆ మెడికల్ షాపులో మెడిసిన్ కొన్నోళ్లే బలి అయ్యేది. ఇది హనుమకొండ నగరం నడిబొడ్డున బరితెగించిన మెడికల్ షాప్ నిర్వాహకుల తీరు. హనుమకొండ చౌరస్తా లో కేర్ ప్లస్ ఫార్మసీ యాజమాన్యం అనుమతి లేకుండా రాయితీపై వచ్చే మందులను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవి ఆరోపణలు మాత్రమే కాదు బహిరంగ రహస్యమే అనడానికి పలువురు బాధితులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
Negligence of drug officials
మెడికల్ షాపు ముసుగులో ప్రభుత్వం అందించే రాయితీ మందులను నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రైవేట్ మెడికల్ షాపులో విక్రయిస్తూ విచ్చలవిడిగా దందా చేయడంలో ఆ మెడికల్ షాప్ యాజమాన్యం ఆరితేరిపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆ మెడికల్ షాపులో కొనుగోలుదారులే సాక్ష్యంగా ఉన్నారనేది గమనార్హం. ఆ మెడికల్ షాపులో జనరిక్ మందులు అమ్ముతూ అధిక రేట్లు ఎందుకు తీసుకుంటున్నారని ఎవరైనా వినియోగదారులు ప్రశ్నిస్తే ఇదంతా డ్రగ్ ఇన్స్పెక్టర్లకు తెలుసు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అంటూ దబాయించడం పలువురు బాధితులను షాక్ కు గురి చేసినట్లు తెలుస్తోంది.
Negligence of drug officials
అయితే పొలిటికల్ అండదండలు ఉన్నాయనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ మెడికల్ షాప్ ముసుగులో జనరిక్ మందుల దందా చేస్తున్న హనుమకొండ చౌరస్తాలోని ” కేర్ ప్లస్ ఫార్మసీ”మెడికల్ షాపు పై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లపై విచారణ చేపట్టాలని పలువురు భావిస్తున్నారు. అయితే పలువురు బాధితులు ఆధారాలతో సహా లికిత పూర్వక పిర్యాదు చేయడానికి సిద్దంగా ఉన్నారనేది గమనార్హం.