
సాంకేతికతిక రంగలో వేగవంతమైన అభివృద్ధి మన జీవన శైలిని అనూహ్యూంగా మార్చివేసింది. అందులో ప్లాస్టిక్ ఒకటి. ప్సాస్టిక్స్ అన్ని షేపుల్లోకి ఒదగ గలిగిన పదార్ధం.అంది బరువులో తేలికగా ఉంటుంది. ఎండా,వాన,చలికి చెక్కు చెదరదు. అన్ని రంగులు వస్తువుల తయారీలో దీనిలో కలపవచ్చు. ప్రతి వస్తువూ అందంగాను,షైనింగ్ తో కనిపిస్తుంది. నేడు ప్లాస్టిక్ తో తయారు చేయబడని వస్తువూ, ఇల్లు, షాపు,స్థలం లేదంటే అతిశయోక్తి కాదు. కానీ లెక్కలేనన్ని రూపాలతో, ఇన్ని పరికరాలతో అందంగా కొలువుదీరి,మన పరిసరాల్లో అనునిత్యం వివిధ రూపాల్లో భాగమైన ప్లాస్టిక్ వల్ల ఎన్ని లాభాలో, అంత ప్రమాదంం కూడా. ఇది మన పంట పోలాల్లో, వాటి పంటల్లో, మానవ శరీరాల్లో, పశువుల్లో సూక్ష్మరూపాల్లో చేరిపోతుంది. ప్లాస్టిక్ జీవుల పాలిట ప్రాణంతకంగా, పర్యావరణ పరంగా పెనుముప్పుగా దాపురించింది. ప్రాణ కోటి మనుగడకు బెడదగా తయారయింది. అందులో నుండి ఈ-వేస్ట్ కూడా మరో పరిణామం. పలుచని ప్లాస్టిక్ తోనూ వాటితో తయారయిన ఎలక్టికల్, ఎలాకట్రానిక్ పరికరాలు వాడుక తరువాత నూతన రూపాలు వస్తాయి. వాడుకలో లేని ఈపదార్ధాలు భూమిలోనూ, నీటిలోనూ,గాలిలోనూ కరగవు. రోజుకు లక్షల టన్నులు ఉత్పత్తి వివిధ వస్తువుల, పరికరాల రూపంలో తయారు చేయబడుతుంది. కొంత కాలానికి పనికి రాని ఈ వేస్ట్ గా మారుతుంది.
ఈ-వేస్ట్ వాడుకలో లేని ఎలక్ట్రానిక్ పరికరాలను సూచిస్తుంది. ఉదాహరణకు, స్మార్ట్ఫోన్లు, లాప్‌టాప్‌లు, టెలివిజన్లు. ఈ-వేస్ట్‌గా తయారవుతాయి. వీటిని సరైన విధంగా నిర్వహించకపోతే, ఇది పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి మరియు జీవవైవిధ్యానికి తీవ్రమైన ప్రమాదకారిగా తయారవుతాయి. ఈ ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల అనేక మూలకాలు,విష పదార్ధలు నుండి తయారవుతాయి. అవి గాలిలో, పర్యావరణంలో కలిస్తే జీవకోటికి ప్రమాదం
సమస్య యొక్క పరిమాణం
ప్రపంచవ్యాప్తంగా, ఈ-వేస్ట్ అత్యంత వేగంగా పెరుగుతున్న వ్యర్థాలుగా తయారయింది. 2019లో 53.6 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయబడిన ఈ-వేస్ట్. 2030 నాటికి 74 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని ఒక అంచనా.
పర్యావరణంపై ప్రభావం
ఈ-వేస్ట్‌లో విషాకారక పదార్థాలు ఉన్నాయి. అవి విసర్జన చేస్తే, నేలనూ,నీటిని,గాలిని కలుషితం చేస్తుందు. చివరకు పరిసరాలు కూడా కాలుష్యానికి గురవుతాయి. చేస్తాయి.
ఆరోగ్యానికి ప్రమాదం
ఈ-వేస్ట్ ఆరోగ్యానికి ప్రమాదకరం అని అభివృద్ధి చెందిన దేశాలు వివిధ రకాల పరిశోధనలు చేసి తేల్చారు. ఇప్పు ఆ ఈ- వేస్ట్ వివిధ రూపాల్లో ఆ దేశాలనుండి అభివృద్ధి చెందుతున్న దేశాలలో కి,వెనుక బడిన ఆసియా,లాటిన్ అమెరికా,ఆఫ్రికా దేశాల్లోకి లక్షల టన్నులు షిప్పుల్లో, కార్గో విమానాల్లో డంప్ చేస్తున్నారు. ఈ- వేస్ట్ పరిసరాల్లో పని చేసే వారు, దెగ్గరగా నివసించే వారు దాని విషపూరిత పదార్థాలకు తీవ్రంగా గురవుతున్నారు.
పరిష్కారాలు
చట్టాలను నియమాలు: ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను, నియమాలను రూపొందించి వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాలి.క్రమంగా వాటిని శాస్త్రీయంగా నిర్మూలించాలి.
ఉత్పత్తిదారుల బాధ్యత
ఉత్పత్తులు పునర్వినియోగానికి అనుకూలంగా ఉండాలి.అవసరం తీరిన వెంటనే పర్యావరణానికి హాని కలగ కుండా నిర్మూలన చేయాలి.
పునర్వినియోగ మౌలిక వసతులు: ఆధునిక సాంకేతికతతో పునర్వినియోగ కేంద్రాలకు పెట్టుబడులు అవసరం.
ప్రజలకు అవగాహన పెంచాలి
వినియోగదారులకు వాటిని పునర్వినియోగం గురించి చైతన్యవంతం చేయాలి. వారిలో విద్య ద్వారా ఈ- వేస్టుతో సంభవించే ప్రమాదాలపై అవగాహనను పెంచాలి.
సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ
* పరికరాలను పునర్వినియోగం మరియు మరమ్మత్తుకు అనుకూలంగా రూపొందించాలి.వాటికోసం ప్రత్యేక నిధులను కేటాయించాలి.
* ఈ-వేస్ట్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సమష్టిగా ఆసియా,ఆఫ్రికా,లాటిన్ అమెరికా దేశాలు సమిష్టిగా చర్యలు తీసుకోవాలి.
* ఇతర దేశాల నుండి ఈ- వేస్ట్ నుఅనుమతించకూడదు:
పాత్యాత్య దేశాలకు పనికి రాని ఈ-వేస్ట్ వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకూ పనికి రాదు. వాటిని ఉమ్మడిగా తమ దేశాల్లో షిప్పల ద్వారా, కార్గో విమాణాల ద్వారా డంప్ కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలి.
దండెబోయిన అశోక్ యాదవ్
గెజిటెడ్ హెడ్మాస్టర్, పెద్ధ మడూర్
జనగామ
సెల్ : 9440521990