
Oplus_131072
ఎస్ఎస్ఎఫ్ ఫౌండర్ “చార్వాక”
National science day program ఫిబ్రవరి 28, జాతీయ శాస్త్రియ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ లోని జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ల్లో సైంటిఫిక్ స్టడీ ఫోరం (ఎస్ఎస్ఎఫ్ ) ఆధ్వర్యంలో విద్యార్థులలో శాస్త్రీయ అవగాహన సదస్సు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ. భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సైంటిఫిక్ స్టడీ ఫోరం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ చార్వాక మాట్లాడుతూ
మనం నిత్య జీవితంలో ఉదయం లేవడం
నుండి రాత్రి పడుకునే వరకు ప్రత్యక్షంగా గానీ లేదా పరీక్షంగా గానీ మనము ఉపయోగించే ఎన్నో వస్తువులు, పరికరాలు సైన్సు సూత్రాలపైన ఆధారపడి తయారు చేసిన వాటినే మనం వాడుతున్నాం. శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణల ఫలితాల కోసం కొన్ని సందర్బాలలో కొన్ని సంవత్సరాలపాటు శ్రమించి వారి వ్యక్తిగత సుఖాలను సైతం త్యాగం చేస్తారు. కొంతమంది శాస్త్ర వేత్తలు తమ జీవితాలను సైతం త్యాగం చేసినవారున్నారు. సివి రామన్ గారు 1930వ సంవత్సరంలోనే భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారన్నారు. ఈ ప్రయోగానికి ఫలితంగా నోబెల్ ప్రైజ్ ను అందుకున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకువచ్చి సమాజంలో మూఢనమ్మకాల నిర్మూలన కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని నేషనల్ సైన్స్ డే సందర్భంగా ప్రభుత్వం అందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.
National science day program
సైంటిఫిక్ స్టడీ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల సుమన్ దొంగ బాబాలు దొంగ స్వామీజీలు మ్యాజిక్ ట్రిక్కులతో ప్రజలను ఏ విధంగా మోసం చేస్తారో తన మ్యాజిక్ షో ద్వారా చేసి వివరించారు. హారతి కర్పూరం మండించి నోట్లో వేసుకోవడం, ఇసుక నుండి విభూది తీయడం మరియు డబ్బులను సృష్టించడం, మంచినీటిని మండించడం ఇటువంటి మ్యాజిక్ ట్రిక్కులను చేసి అందులో ఉన్న రహస్యాలను విద్యార్థులకు వివరించారు. విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మరియు శాస్త్రవేత్తలు తమ ఫలితాలను సమాజానికి అందించడం కోసం ఎటువంటి త్యాగాలు చేశారు ఈ సందర్భంగా వివరించారు.
National science day program
ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు, రణధీర్ రెడ్డి గారు SSF వరంగల్ జిల్లా అధ్యక్షుడు శివాజీ మరియు పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులతోపాటు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.