
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రామతీర్థ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత పథకాలలో భాగంగా నల్లబెల్లి మండలంలోని రామతీర్థం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించి గ్రామంలో ఇండ్లులేని పేదలకు 33 ఇందిరమ్మ ఇండ్లు, 71 ఆహార భద్రత (రేషన్)కార్డులు, ఆత్మీయ భరోసా కింద 20 కి పైగా రైతులకు ఇవడం ఆనందంగా ఉందని, సీఎం రేవంత్ రెడ్డికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రామతీర్థం గ్రామ పార్టీ అధ్యక్షుడు మెరుగు శీను, ఉపాధ్యక్షులు చిర్ర నరేష్, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు ఎండి తహరా, మండ కల్పన, బద్ది సంపత్,పొదిల శోభను తోపాటు పొదిలా అశోక్,మెరుగు చందర్, మండ శోభన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.