
- సమయపాలన పాటించని వైద్యులు…
- ఇబ్బందులు పడుతున్న రోగులు
- వైద్యాధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు…
రజినీ కుమార్ / వరంగల్ జిల్లా ప్రతినిధి :
Nallabelli Primary Health Center in the shadow of neglect : అక్కడ చూడటానికి ఆసుపత్రి ఉంది కానీ ప్రాణం సుస్థి చేస్తే మందులు ఇవ్వడానికి వైద్య సిబ్బందే సమయానికి అందుబాటులో ఉండరు. ఒకదశలో స్వీపరే కొన్ని సార్లు మందులు ఇవ్వాల్సిన పరిస్థితి. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రైవేటు క్లినిక్ లను, ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి.
Nallabelli Primary Health Center in the shadow of neglect
వైద్యాధికారి సమయపాలన పాటించకపోవడం ఇష్టారితీగా రావడం పోవడం సర్వసాధారణంగా కనిపించే అంశంగా పలువురు భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు వైద్యసేవలు అండటం అంతంతమాత్రంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ అధికారి సమయానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాకపోయినా అడిగే నాధుడు లేకపోవడంతో ఆయన ఆడిందే ఆటగా పాడిందే పాట పరిస్థితి మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Nallabelli Primary Health Center in the shadow of neglect
మరోవైపు తనకు అనుకూలంగా ఉండే కొందరు ఆర్ఎంపీలకు ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మెడిసిన్ కూడా సరఫరా అవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ నల్లబెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పట్ల జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.