
- వరంగల్ రవాణాశాఖలో బరితెగించి “ఎంవీఐ”ల వసూళ్లు.. !
- మరోవైపు వార్తాకథనాలపై అక్కసు వెళ్లగక్కుతున్న ప్రబుద్ధులు….
- సుద్దపు పూసలాగా కేసులు పెడుతామంటూ డాంబికాలు…
- ప్రయివేటు అసిస్టెంట్ ను పట్టుకుంటే “ఎంవీఐ”ల గుట్టురట్టు అయ్యో అవకాశం….
“MVI” bribery scandal : అక్కడంతా సుద్దపు పూసలే. చేతివాటాలు వారికి సర్వసాదరణమే. అక్కడ జరిగే దందాపై వార్తాకథనాలు రాస్తే వారేదో సత్య హరిశ్చంద్రుల్లా నీతి సూత్రాలు వల్లబోస్తూ అవసరమైతే కేసులు పెడుతామని ప్రచారం చేయడం వారికే చెల్లింది. అసలు వరంగల్ రవాణాశాఖలో జరుగుతున్న తతంగం పట్ల జిల్లా కలెక్టర్, ఎసిబి అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే సత్య హరిశ్చంద్రుల బాగోతం ఏంటనేది తేటతెల్లం అవుతుందనేది గమనార్హం.
“MVI” bribery scandal
వరంగల్ రవాణాశాఖలో చేతివాటం రాజ్యమేలుతున్నది. ఎంవీఐల బరితెగింపు రోజురోజుకూ మితిమీరడం బహిరంగ రహస్యంగా మారింది. అంతా తెలిసినా ఉన్నతాధికారులు సైతం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నటశోభన కిరీటాలదే రాజ్యంగా ఆ కార్యాలయం మారిందనే ఆరోపణల్లో నిజం లేకపోలేదు. ఆ కార్యాలయానికి ఏసేవ కోసం వచ్చినా ప్రతీ పనికి ఓ రేటు ఫిక్స్ చేసి మరీ దందా సాగించడం ఆ ఎంవీఐలకే చెల్లిందని పలువురు వాపోతున్నారు. మరోవైపు వాహనదారులకు ఏ పని కావాలన్న అధికారులు నియమించుకున్న ప్రైవేట్ అసిస్టెంట్ లను కలిసి వారు అడిగిన మొత్తం సమర్పించుకోవాలని లేదంటే వారి పని మూలన పడుతుందని నెలల తరబడి తిరిగినా పని కాదని చివరికి ప్రైవేట్ అసిస్టెంట్ లను కలిస్తేనే పని అవుతుందని విశ్వసనీయ సమాచారం.
“MVI” bribery scandal
- ఏ సేవకు ఎంత లంచం.. అందులో నుండి ఎవరికి ఎంత..?
వాహనదారులు ప్రభుత్వానికి చెల్లించే ఫీజు కంటే కూడా ముడుపుల రూపంలో అధికారులకు చెల్లించే ఫీజు అధికం అని తెలుస్తోంది. వాహనదారులు ఏ సేవకు ప్రభుత్వానికి ఎంత ఫీజు చెల్లిస్తారు..అదే సేవకు ఆ కార్యాలయంలో ఎంవీఐల కనుసన్నల్లోని ప్రైవేట్ అసిస్టెంట్ లకు లంచాలు ఎంత సమర్పించుకుంటారు.
కొన్ని వివరాలు…
“MVI” bribery scandal
- లైసెన్స్ లకు ప్రభుత్వ ఫీజు వివరాలు….లంచాల వివరాలు..
లెర్నింగ్ లైసెన్స్ కు: ప్రభుత్వ ఫీజు రూ. 450
లంచం: రూ. 1000
అందులోనుండి ఎంవీఐ కి రూ. 900,
పర్మినెంట్ లైసెన్స్ కు ప్రభుత్వ ఫీజు రూ. 1335
లంచం రూ. 1500
ఈ మొత్తం ఎంవీఐ కే అనే ఆరోపణలు లేకపోలేదు.
హెవీ లైసెన్స్ కు ప్రభుత్వ ఫీజు రూ. 1600
లంచం రూ. 3300
ఈ మొత్తం ఎంవీఐకే
ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ కు:ప్రభుత్వ ఫీజు రూ. 1335
లంచం రూ. 2100
ఈ మొత్తం కూడా ఎంవీఐకే
కొత్త వాహన రిజిస్ట్రేషన్ లు
వీటికి ప్రభుత్వ ఫీజు ఉండదు
లంచాల వివరాలు…
నాన్ ట్రాన్స్ పోర్ట్ (సొంతవాహనాలు) :
టూ వీలర్ కు ప్రభుత్వ ఫీజు లేదు
లంచం : రూ. 450
అందులో నుంచి ఎంవీఐకి రూ. 250
కార్లకు : ప్రభుత్వ ఫీజు లేదు
లంచం : రూ. 1000
అందులో నుండి ఎంవీఐ రూ. 600
3వీలర్స్ రిక్షా ప్యాసింజర్ కు: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం : రూ. 3వేలు
అందులో నుండి ఎంవీఐ కి రూ. 600
LMV గూడ్స్ కు: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం : రూ. 1800
అందులోనుండి డిటివో కు రూ. 200
ఎంవీఐకి రూ. 1200
ట్రాక్టర్ ట్రాలీ కి: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం : రూ. 2900
అందులోనుండి ఎంవీఐ కి రూ. 1500
మోటార్ క్యాబ్ కు: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం : రూ. 4600
అందులోనుండి డిటివో కు రూ. 2200
ఎంవీఐ కి రూ. 1400
మీడియం గూడ్స్ వెహికిల్ కు: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం : రూ. 5200 అందులోనుండి
డిటివో కు రూ. 2200
ఎంవీఐ కి 2200
హెవీ గూడ్స్ వెహికిల్ కు: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం : రూ. 10,700
అందులోనుండి
ఎంవీఐ కి రూ. 5500
జేసీబీ కి ప్రభుత్వ ఫీజు లేదు
లంచం : రూ. 5700
అందులోనుండి
ఎంవీఐకి రూ. 2400
హార్వెస్టర్ కు: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం : రూ. 9900
అందులోనుండి
ఎంవీఐ కి రూ. 2400
- ఫిట్ నెస్ లు.. ప్రభుత్వ ఫీజు… లంచాల వివరాలు…
ఆటో రిక్షా ఫిట్ నెస్ కి ప్రభుత్వ ఫీజు రూ. 600
లంచం : రూ. 500
అందులోనుండి
ఎంవీఐ కి రూ. 400
LMV గూడ్స్ ఫిట్ నెస్ కు:ప్రభుత్వ ఫీజు రూ. 800
లంచం : రూ. 1100
అందులోనుండి
ఎంవీఐకి రూ. 1000
ట్రాక్టర్ ట్రాలీ ఫిట్ నెస్ కు ప్రభుత్వ ఫీజు రూ. 800
లంచం: రూ. 1500
అందులోనుండి ఎంవీఐ కి రూ. 1400
మోటార్ క్యాబ్ ఫిట్ నెస్ కు :ప్రభుత్వ ఫీజు రూ. 800
లంచం : రూ. 1000
అందులోనుండి ఎంవీఐ కి రూ. 900
మీడియం గూడ్స్ వెహికిల్ ఫిట్ నెస్ కు ప్రభుత్వ ఫీజు రూ. 1000
లంచం : రూ. 1900 అందులోనుండి
ఎంవీఐ కి రూ. 1800
హెవీ గూడ్స్ వెహికిల్ ఫిట్ నెస్ కు
ప్రభుత్వ ఫీజు రూ. 1000
లంచం : రూ. 2300
అందులోనుండి ఎంవీఐ కి రూ. 2200
*******