
Mulugu
- అధికారులంతా మావాళ్లే తమకేం కాదనే ధీమాలో శ్రేష్ట ప్లాంటా ప్రొడక్ట్స్ నిర్వాహకులు…!
- “జంగాలపల్లి” కేంద్రంగా కేంద్రంగా యధేచ్ఛగా సాగుతున్న “బయో మందుల” దందా..!!
- కనీస పర్యవేక్షణ చేయని అగ్రికల్చర్ అధికారుల తీరుపై అనేక అనుమానాలు…
- తక్షణమే విచారణ చేపట్టాలంటున్న పలువురు…
Agriculture news : ములుగు జిల్లా జంగాలపెల్లి కేంద్రంగా బయో మందుల దందా యధేచ్ఛగా సాగిస్తున్న”శ్రేష్ట ప్లాంటా ప్రొడక్ట్స్”జేబులో వ్యవసాయశాఖ అధికారి (ఏవో) తమ జేబులో ఉన్నారంటూ సదరు బయో మందుల నిర్వాహకులు విర్రవీగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులంతా మావాళ్లే తమకేం కాదనే ధీమాలో శ్రేష్ట ప్లాంటా ప్రొడక్ట్స్ నిర్వాహకులు ప్రచారం చేసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ “జంగాలపల్లి” కేంద్రంగా కేంద్రంగా యధేచ్ఛగా సాగుతున్న “బయో మందుల” దందా పట్ల అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడమే ఇందుకు కారణమని పలువురు భావిస్తున్నారు. కనీస పర్యవేక్షణ చేయని అగ్రికల్చర్ అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సమగ్రమైన చేపట్టి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.