
Mulugu district ములుగు జిల్లాలోని యాసంగి సన్నధాన్యం బోనస్ డబ్బులు సుమారు 33 వేల 786 క్వింటాల డబ్బులు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం నుండి జాతీయ రహదారి 163 స్థానిక మజిల్ సెంటర్లో రాస్తారోకో చేయడం జరిగింది.
ఈ రాస్తారోకోని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజాద్ పాషా పాల్గొని మాట్లాడుతూ… ములుగు జిల్లాలోని యాసంగి సన్నధాన్యం ఆయా ప్రభుత్వ సెంటర్లో అమ్మి నాలుగు నెలలు పూర్తయిన, నేటి వరకు ఆయా రైతులకు సన్నధాన్యం బోనస్ డబ్బులు చెల్లించకపోవడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు. సుమారు 33 వేల క్వింటాల సన్నధాన్యం బోనస్ డబ్బులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, రైతులను ఆదుకోవాలని,
ఈ సందర్భంగా డిమాండ్ చేసినారు. రైతుల దగ్గర పెట్టుబడి కి డబ్బులు లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల చుట్టూ తిరుగుతూ అప్పుల పాలవుతున్నారన్నారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాను రైతులకు సకాలంలో అందించి ఆదుకోవాలని అన్నారు. రైతులకు సన్నధాన్యం బోనస్ డబ్బులు మరియు యూరియా బ్యాంకులు రుణాలు, అందించి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని అన్నారు. లేనిచో ములుగు జిల్లా రైతాంగమును సమీకరించి ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం జరిగింది. ఈ ర్యాలీ రాస్తారోకో కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు భానోత్ నారాయణ సింగ్, జీవన్ రెడ్డి, మంకిడి కృష్ణయ్య, తిరుపతి రెడ్డి, ఈసం మహేందర్, జార యాకయ్య, నాగరాజు, ఎండి అబ్దుల్ నబి, పావురాల బిక్షపతి, వాసం రమేష్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు, ఇంజన్ కొమురయ్య, తయ్యారులు పాల్గొన్నారు.