
MRPS 31st Foundation Day Celebrations in Tekulagudem : హనుమకొండ జిల్లా కాజిపేట మండలం టేకులగూడెంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) 31వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. గ్రామ ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి పున్నంచందర్ అధ్యక్షున జరిగిన ఈ సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన యువ న్యాయవాది, సామాజిక కార్యకర్త మాచర్ల మహేష్ చంద్ర జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
MRPS 31st Foundation Day Celebrations in Tekulagudem
మాదిగల మూడు దశాబ్దాల సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే SC వర్గీకరణ జరిగిందని తెలిపారు. “లక్ష్యసాధనలో మిలిటేన్సి పోరాటాలకు కూడా వెనకడుగు వేయకుండా ప్రాణ త్యాగం చేసి అమరులైన గొప్ప మాదిగ బిడ్డలు ఉన్నారని, అమరుల త్యాగ ఫలితం, పద్మశ్రీ కృష్ణ మాదిగ గారి రాజీలేని పోరాటం వర్గీకరణ ఫలితం అని అన్నారు. ఈ అవకాశం అందిపుచ్చుకోని మాదిగలు సామాజిక , ఆర్థిక, రాజకీయంగా ముందడుగు వేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పొడిచేటి ప్రభుదాస్, అరుముల రాజు, గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ క్రిస్టఫర్, సహాయ కార్యదర్శి మాతాంగి సునీల్, ముఖ్య కార్యవర్గ సభ్యులు సందీప్, ప్రశాంత్ ,కరుణాకర్, కుమారస్వామి, అలెగ్జాండర్ తదితరులు పాల్గొన్నారు.