
టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్
Hanumakonda హనుమకొండ : ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే టీచర్ల యొక్క సమస్యలపై గళ మెత్తుతానని కూడా మాజీ చైర్మన్, నల్గొండ,వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ అన్నారు.ఈ సందర్భంగా హనుమకొండలోని అశోక కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల ప్రతినిధిగా,ఉద్యమకారుడిగా,అధ్యాపకుడిగా పని చేస్తున్నటువంటి తనకు ఉపాధ్యాయుల సమస్యల పట్ల అవగాహన ఉందన్నారు.ఆ సమస్యలను పరిష్కరించడానికి వరంగల్, నల్గొండ,ఖమ్మం టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు.ఏ పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గానే బరిలో నిలుస్తానని, ప్రభుత్వ, ప్రైవేటు అధ్యాపకులు, ఉపాధ్యాయులు భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ప్రతి ఒక్కరికి అనేక సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, విద్యాసంస్థల అధినేతలు మూగల కుమార్ యాదవ్, సతీష్, పులి శ్రీనివాస్, చిరంజీవి, నాయకులు,అధ్యాపకులు, వివిధ బి సి సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.