
- అమాయకులను దోచుకుంటున్న” కేర్ ప్లస్ ఫార్మసీ” మెడికల్ యాజమాన్యం
- కేర్ ప్లస్ ఫార్మసీ లో జనరిక్ మందులను అమ్ముతూ అధిక మొత్తంలో కొల్లగొడుతున్న నిర్వాహకులు
- డ్రగ్ ఇన్స్పెక్టర్ కు తెలుసు ఏంచేస్తారో చేసుకోండంటూ రోగులను బెదిరిస్తున్న వైనం
Medical shop masks generic drugs scam : మెడికల్ షాపు ముసుగులో ప్రభుత్వం అందించే రాయితీ మందులను నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రైవేట్ మెడికల్ షాపులో విక్రయిస్తూ విచ్చలవిడిగా దందా చేయడంలో ఆ మెడికల్ షాప్ యాజమాన్యం ఆరితేరిపోయినట్లు ఆరోపణలు జోరుగా వినవస్తున్నాయి.
Medical shop masks generic drugs scam
రోగులతోపాటుగా, పలువురు వ్యక్తులు ఆ మెడికల్ షాప్ లో జరుగుతున్న మందుల దందాపై జననిర్ణయం ప్రతినిధితో మాట్లాడుతూ హన్మకొండ చౌరస్తా లో కేర్ ప్లస్ ఫార్మసీ యాజమాన్యం అనుమతి లేకుండా రాయితీ పై వచ్చే మందులను నిబంధనలకు విరుద్ధంగా రోగులకుఅమ్మడమే కాకుండా ఇవి జనరిక్ మెడిసిన్ మీరు ఎలా అమ్ముతారు అని ప్రశ్నిస్తున్న రోగుల బంధువులును డ్రగ్ ఇన్స్పెక్టర్ కు చెప్తారా? జిల్లా వైద్యాధికారి కి చెప్తార అని బెదిరిస్తుండడం గమనార్హం.
Medical shop masks generic drugs scam
- మెడికల్ షాపులో జనరిక్ మందుల దందా…?
- సహకరిస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్.. పూర్తి కథనం మరో సంచికలో