
ప్రాణాలతో చెలగాటమాడుతున్న
“బంధన్” హాస్పిటల్..!?
* జర్నలిస్టు ప్రాణాలతో చెలగాటమాడిన “బంధన్” హాస్పిటల్ వైద్యులు…
*బంధన్ హాస్పిటల్ పై “డీఎం అండ్ హెచ్ఓ” కు ఫిర్యాదు..!
– విచారణ జరిపి న్యాయం చేస్తానని హామీనిచ్చిన హనుమకొండ జిల్లా “డీఎం అండ్ హెచ్ఓ”…
హనుమకొండ నగరంలోని “బంధన్” హాస్పిటల్ ప్రాణాలతో చెలగాటం ఆడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ యువకునికి వైద్యం చేయడంలో ఆ ఆసుపత్రి డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణప్రాయ పరిస్థితికి తెచ్చారంటూ సదరు బాధితుడు
జిల్లా “డిఎం అండ్ హెచ్ఓ” కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చంది. బంధన్ హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై “డీఎం అండ్ హెచ్ ఓ”కు బాధితుడు ఫిర్యాదు చేయడంతో బంధన్ హాస్పిటల్ వైద్యం పట్ల అనుమానాలకు తావిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా బంధన్ హాస్పిటల్ నిర్వహిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఈ ఘటన తెలుపుతోందని పలువురు భావిస్తున్నారు. సమగ్రమైన విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని, వైద్యంతో చెలగాటం ఆడుతున్న వైద్యుల పట్ల, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడుతున్న హాస్పిటల్ పట్ల చర్యలు తీసుకోవాలని పలువురు భావిస్తున్నారు.