“Medaram Jatara” towards existential destruction : తెలంగాణ గిరిజన అస్తిత్వానికి నిలువుటద్దం మేడారం. అడవి బిడ్డల హక్కుల కోసం, పరాయి పాలనపై ఎదిరించిన వీరవనితల నెత్తురు చిందిన నేల ఇది. కానీ, నేడు ఈ జాతర తన మూల స్వరూపాన్ని కోల్పోతోంది. అస్తిత్వ పోరాట చిహ్నాన్ని ఒక ‘కార్పొరేట్ ఆధ్యాత్మిక సంత’గా మారుస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోందనడంలో సందేహం లేదు.
మేడారం జాతరలో విగ్రహాలు ఉండవు, పురాణ కథలు ఉండవు. అక్కడ ఉండేది కేవలం ప్రకృతి చిహ్నాలైన గద్దెలు, వెదురు బుట్టలు. కానీ, ఇటీవలి కాలంలో ఈ జాతరపై వైదీకీకరణ (Sanskritization) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజన పూజారులైన ‘కోయ దొరల’ ప్రాధాన్యతను తగ్గిస్తూ, ఇతర వర్గాల ఆధిపత్యం పెరగడం వల్ల గిరిజన సంస్కృతి తన ప్రత్యేకతను కోల్పోతోంది. పోరాట చరిత్రను మరుగున పడేసి, కేవలం ‘మొక్కులు-ముడుపులు’ అనే ఆధ్యాత్మిక ఫ్రేమ్‌లోకి దీనిని బంధిస్తున్నారనేది కాదనలేని వాస్తవంగా కనిపిస్తున్నది. ఒకప్పుడు స్వచ్ఛమైన భక్తితో, గిరిజన ఆచారాలతో సాగే ఈ జాతర నేడు ‘కార్పొరేట్ బ్రాండింగ్’కు అడ్డాగా మారింది. జాతర ప్రాంగణమంతా టెలికాం, శీతల పానీయాలు, రియల్ ఎస్టేట్ కంపెనీల ఫ్లెక్సీలతో నిండిపోతోంది. భక్తుల రద్దీని కేవలం ‘కన్జ్యూమర్ బేస్’ (వినియోగదారులు)గా చూస్తున్న కార్పొరేట్ శక్తులు, అక్కడ ఆధ్యాత్మికత కంటే వ్యాపారానికే పెద్దపీట వేస్తున్నాయి.
ప్రైవేటీకరణ కోణాలు కోకొల్లలుగా కనిపిస్తున్న పరిస్థితి. పార్కింగ్ నుంచి మొదలుకొని, ప్రసాదాల తయారీ, పారిశుధ్యం వరకు ప్రతిదీ కాంట్రాక్టుల పరమవడటంతో జాతర ఒక భారీ బిజినెస్ మోడల్‌గా రూపాంతరం చెందింది. ఇక విఐపి దర్శన సంస్కృతి అనేక రేట్లు పేరిగి సమానత్వానికి గొడ్డలిపెట్టుగా మారింది. సమ్మక్క-సారలమ్మల పోరాటం సామాన్యుల కోసం. కానీ నేడు మేడారంలో ‘ప్రోటోకాల్’ పేరిట సామాన్యుడిని అవమానిస్తున్న దుస్థితి అనేక రేట్లు పేరిగింది. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూసే సామాన్య భక్తుడి కంటే, విఐపి (VIP) దర్శనాలకే అధికారులు మొగ్గు చూపుతున్నారని సామాన్య జనానికి ఇట్టే అర్థం అవుతున్న పరిస్థితి. అధికారం, ధనం ఉన్న వారికి ప్రత్యేక మార్గాలు, ఏసీ గదులు ఏర్పాటు చేయడం ద్వారా ఈ జాతరలోని ‘సామాజిక సమానత్వం’ అనే ప్రాథమిక సూత్రం దెబ్బతింటోంది.
మరోవైపు పర్యావరణ విధ్వంసం అనేది అడవికి ఆపదగా మారింది. గిరిజన సంస్కృతి అడవిని దైవంగా భావిస్తుంది. కానీ నేడు జాతర పేరుతో అడవిని కబళిస్తున్నారని ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేదు. కార్పొరేట్ కంపెనీల ఉత్పత్తుల వల్ల జాతర ముగిసే సరికి టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్న అనుభవాలు ఉండనే ఉన్నాయి. ఈ స్థితి భూగర్భ జలాలను, వన్యప్రాణులను ప్రమాదంలోకి నెడుతోంది.
“Medaram Jatara” towards existential destruction..!
మేడారం కేవలం ఒక పండుగ కాదు, అది ఒక రాజకీయ చైతన్యం. పన్నుల భారానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని గుర్తుచేసుకోవాల్సిన చోట, ప్రజలు కేవలం తమ వ్యక్తిగత సమస్యల కోసం మొక్కులు చెల్లించుకుని వెళ్ళిపోయేలా వ్యవస్థను మార్చేశారు. అస్తిత్వ పోరాట చిహ్నమైన మేడారాన్ని వాణిజ్యమయం చేయడం అంటే మన చరిత్రను మనం అమ్ముకోవడమే. ఆధ్యాత్మికత పేరుతో కార్పొరేట్ శక్తులు గిరిజన సంస్కృతిని మింగేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేధావులపైన ఉంది. ప్రభుత్వంపై ఒత్తడితెచ్చి బాధ్యతను గుర్తుచేయాలి. మేడారంను తన సహజ సిద్ధమైన, పోరాట పటిమ గల ‘గిరిజన జాతర’గా మార్చాలి.
రాజేందర్ దామెర (దారా)
Editor
www. jananirnayam. com

దీనంతటికీ ప్రధాన కారణమైన, పక్కనే ఉండి అన్ని నడుస్తున్న, నడిపిస్తున్న స్థానిక ఎమ్మెల్యే, మరియు తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు సీతక్క గారు కిమ్మనకుండా ఉండడమే దీని అంతటికి కారణం.. కోయ సంస్కృతి తను పుట్టినప్పటి నుండి చూస్తూ పెరిగినామే.. అదే కార్పొరేట్ సంస్థలకు ఏ విధంగా తను సహకరిస్తుంది.. మీరన్నట్టుగా మరో తిరుపతి యాదగిరిగుట్ట లాగా విఐపి దర్శన సంస్కృతి, మరియు ముఖ్యమంత్రి గారు స్వయంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి చేసి చూపెడతాననడం.. మేధావులు మరియు స్థానికులైన కోయ ఆదివాసీలు, దీనిపైన గట్టిపట్టు పట్టాల్సిన అవసరం ఉంది. జాతర అనంతరం అక్కడ వదిలిపెట్టిన ప్లాస్టిక్ మరియు వ్యర్ధాల వల్ల.. జాతర పరిసర ప్రాంతంలో నివాసం చేస్తున్న కోయ ఆదివాసుల పరిస్థితి ఏంటి.. ఆ విషయంలో ప్రభుత్వం వారికి ఏమీ హామీ ఇస్తుంది..
👍🤝 thanQ sir వాస్తవాన్ని చెప్పారు
ఇదే మాట చిన్న జీయర్ స్వామి వారు చెబితే దానికి తాటాకులు కట్టి ఆయనని అవమాన పరిచారు. ప్రజలు నిజం గుర్తించాలి. సమ్మక్క సారలమ్మ వీరు గొప్ప పోరాట వనితలు. వారి పోరాటం ఒక ఆదర్శం గా తీసుకోవాలి. అంతే కానీ వారి తో వ్యాపారం చేయకూడదు.
👍ThanQ