
ఎంసిపిఐ(యు) నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్
Warangal వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన mcpiu ఎంసిపిఐ(యు) మండల కమిటీ సభ్యులు మంద సంజీవ ఆకస్మికంగా అనారోగ్యానికి గురై గురువారం తెల్లవారుజామున హైదరాబాదులోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతిచెందడం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటని ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ అన్నారు.
అమరజీవి, అసెంబ్లీ టైగర్ కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ తో కలిసి అనేక కమ్యూనిస్టు ప్రజా ఉద్యమాలలో మంద సంజీవ పాల్గొన్నారని, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా కడవరకు నిలిచిన కమ్యూనిస్టు పోరాట ఉద్యమ స్ఫూర్తి అని వారి సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు వంగల రాగసుధ, నాగెల్లి కొమురయ్య, దామ సాంబయ్య,, మార్త నాగరాజు, బుడిమే సమ్మయ్య తదితరులు పూల మాలలు వేసి నివాళి అర్పించారు.