
- సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి
Market porter workers should be given identity cards : వరంగల్ జిల్లా రాయపర్తి వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డు నందు పని చేస్తున్న హమాలి కార్మికులకు లైసెన్సులు, రెండు జతల యూనిఫారాలు, గుర్తింపు కార్డులు, ఇన్సూరెన్స్ ఇప్పించాలని సిఐటియు ఆద్వర్యంలో ఇల్లంద వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్యకు వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా కాసు మాధవి చైర్మన్ గారికి హమాలి కార్మికుల సమస్యలు వివరిస్తూ రాయపర్తి వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డ్ నందు గత 12 సంవత్సరాలుగా 50 మంది హమాలి కార్మికులు పని చేస్తున్నారన్నారు. వానాకాలం, యాసంగి సీజన్లతో పాటు గోదాములో మక్కలు, పత్తి బేల్లు నిల్వచెస్తున్నారని, ప్రస్తుతం సివిల్ సప్లై కార్పొరేషన్ వారి బియ్యం కూడా నిల్వ చేయుటలో హమాలి కార్మికులగా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారన్నారు. వీరి శ్రమ వలన మార్కెట్ కు లక్షల్లో ఆదాయం సమకూరుతుందని అయినా కాని హమాలి కార్మికుల సంక్షేమం మార్కెట్ కమిటీ పట్టించుకోవడం లేదన్నారు. ఇల్లంద మార్కెట్ యార్డ్ హమాలిలకు అందిస్తున్న లైసెన్సులు, యూనిఫారాలు, గుర్తింపు కార్డులు, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు రాయపర్తి హమాలిలకు అందడం లేదన్నారు. కాబట్టి వెంటనే ఇల్లంద మార్కెట్ యార్డ్ హమాలి కార్మికులకు ఇస్తున్నట్లుగానే రాయపర్తి మార్కెట్ సబ్ యార్డ్ హమాలిలకు కూడా లైసెన్సులు, గుర్తింపు కార్డులు ఇస్తూ, ప్రమాదభీమ సౌకర్యం కల్పించాలని, మార్కెట్ యార్డ్ నందు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని, త్రాగునీరు, మరుగు దొడ్ల సౌకర్యం కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల సాంబయ్య, ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు పీరని భిక్షపతి, గద్దల కృష్ణ, చందు రవి, సంగెం రాములు పాల్గొన్నారు.