ఇద్దరు యువకుల అరెస్ట్
Marijuana seized in Damera దామెర మండల పరిధిలో సోమవారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 10,000 విలువైన 210 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Marijuana seized in Damera
పోలీసుల కథనం ప్రకారం…దామెర ఎస్.ఐ. కొంక అశోక్ తన సిబ్బందితో కలిసి లాదేల్ల గ్రామ శివారులోని అన్నపూర్ణ రైస్ మిల్లు సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నంబర్ ప్లేట్ లేని మోటార్ సైకిల్‌పై వస్తున్న ఇద్దరు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకోగా, వారి వద్ద గంజాయి లభ్యమైంది.
Marijuana seized in Damera
నిందితుల వివరాలు
పట్టుబడ్డ వారిని హన్మకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన మేకల అనిల్ కుమార్ (23), బైరపాక రాజేష్ (19)గా గుర్తించారు. అనిల్ కుమార్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తుండగా, రాజేష్ విద్యార్థి అని పోలీసులు తెలిపారు.
Marijuana seized in Damera
సరఫరాదారుల కోసం గాలింపు
నిందితులను విచారించగా, బొల్లికుంటకు చెందిన బుస్స అరవింద్, భూపాలపల్లికి చెందిన ఊకంటి పూర్ణచందర్ రెడ్డి (సన్నీ రెడ్డి) అనే వ్యక్తుల వద్ద ఈ గంజాయిని కొనుగోలు చేసినట్లు వారు ఒప్పుకున్నారు. క్లూస్ టీం సమక్షంలో పంచనామా నిర్వహించి గంజాయిని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.
పరకాల రూరల్ సి.ఐ. పి. రంజిత్ రావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
