
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్
లక్ష డప్పులు వేల గొంతుల మహా ప్రదర్శనను జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ హరిత కాకతీయలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాల నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వేయి స్తంభాల గుడి నుండి అంబేద్కర్ విగ్రహాల వరకు మహా ర్యాలీ ప్రదర్శన ఉందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందకృష్ణ మాదిగ హాజరవుతున్నట్లు తెలిపారు. కుల సంఘాల నాయకులు సంఘాల నాయకులు అధిక సంఖ్యలో వచ్చి మహా ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పుల మండే మాదిగల గుండె చప్పుడు దండోరా సాంస్కృతిక మహా ప్రదర్శన విజయవంతంకై హైదరాబాదులో జరిగే ప్రదర్శన విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశానికి అతిధులుగా మిట్టపల్లి సురేందర్ కవి రచయిత మరియు బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ హాజరై మాట్లాడుతూ…
గౌరవ సుప్రీంకోర్టు తీర్పును తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని,వర్గీకరణ చేస్తే విజయోత్సవం లేకుంటే సర్కారుకు చావు డప్పే అని, దండోరా దండయాత్ర చూపిస్తామన్నారు.
ఎస్సీలలో ఉన్నటువంటి అన్ని కులాల ప్రజలకు విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు అన్ని రంగాలలో జనాభా ప్రాతిపదికన సమాన వాటా దక్కాలనే ప్రధాన ధ్యేయంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నామని గౌరవ సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని అదేవిధంగా మాలల కుట్రలు తిప్పి కొట్టేందుకు ప్రతి మాదిగ బిడ్డ డప్పు సంకనేసుకుని ఫిబ్రవరి 7న జరిగే “వెయ్యి గొంతులు- లక్ష డప్పులు” మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శనకు తరలిరావాలని పిలుపునివ్వడం జరిగింది..
వర్గీకరణ మీద దేశవ్యాప్తంగా వేసిన కమీషన్లు, కమిటీలు వర్గీకరణకు సానుకూలంగా ప్రభుత్వాలకు నివేదికల సమర్పించాయని ఆయా పార్టీలు మేనిఫెస్టోలో కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయని అయినా కూడా కొంతమంది స్వార్థ మాల రాజకీయ నాయకులు వర్గీకరణ జరగకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు సమాజంలో ఉన్న అన్ని వర్గాలు వర్గీకరణ ఉద్యమానికి బాసటగా నిలిచాయన్నారు , లక్షల కోట్లు సంపాదించిన గడ్డం వివేక్ కుటుంబం రాజకీయ రూపంలో ఆగస్టు 1 తేదిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు కాకుండా వర్గీకరణ జరగకుండా సామాజిక న్యాయానికి అడ్డుపడుతున్నారన్నారు , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యక్తి గతంగా వర్గీకరణకు సానుకూలంగా ఉన్న AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అడ్డుపడుతున్నాడన్నారు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కలలు కన్నా రిజర్వేషన్ల సమాన పంపిణీయే వర్గీకరణ ఉద్యమం అన్నారు, ఇన్ని ఏళ్ళుగా రిజర్వేషన్ల ఫలాలను మాల సామాజిక వర్గం వారే వారి జనాభాకు మించి లబ్ధి పొందుతున్నారన్నారు, వర్గీకరణ ఉద్యమం ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. MRPS సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం పొరటం చేస్తుందన్నారు, మాదిగ, ఉపకులాల విద్యార్దులకు విద్య ఉద్యోగ అవకాశాలు రావాలంటే జీవితాలు బాగుపడాలంటే వర్గీకరణ జరగాలని తెలిపారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాను చేయకుండా మాట తప్పి ముందుకెళ్తుందని తక్షణమే వర్గీకరణ చేయాలని అదేవిధంగా వర్గీకరణ వ్యతిరేకుల కుట్రలు అడ్డుకునేందుకు భూమి ఆకాశం దద్దరిల్లేలా మాదిగల మండే గుండె చప్పుడును ప్రపంచానికి తెలియజేసేందుకు ఫిబ్రవరి 7 న హైదరాబాదులో తలపెట్టిన “వెయ్యి గొంతులు -లక్ష డప్పుల” మాదిగల సాంస్కృతిక మహా ప్రదర్శన విజయవంతం చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలోమంద కుమార్ మాదిగ, బొడ్డు దయాకర్ మాదిగ బొచ్చు తిరుపతి మాదిగ గోపు జయపాల్ రెడ్డి రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మేకల కేదార్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు బైరపాక జయకర్ బార్ కౌన్సిలింగ్ సభ్యులు, వీరదాసు వెంకటరత్నం మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు, నీలా శ్రీధర్ రావు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, తండూరి మోహన్, వేల్పుల సూరన్న కాపు, బుట్టి శ్యామ్ జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, రామచంద్రయ్య యాదవ్, ఎమ్మార్పీఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు