
- హ్యాకర్స్ జోన్ ఏర్పాటు చేసి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి
- సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న
- అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన
Street wender act -2014 వెండర్స్ యాక్ట్ 2014 ను అమలు చేయాలని, హ్యాకర్స్ జోన్ ఏర్పాటు చేసి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాంస్ట్రీట్డ్ చేస్తూ శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా జంక్షన్ లో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటాల సోమన్న మాట్లాడారు. జనగామ పట్టణంలో పండ్లు, కూరగాయలు, సోడా బండి తదితర తోపుడు బండ్ల సహకారంలో చిరు వ్యాపారం చేసుకునే కార్మికులకు హాకర్స్ జోన్ లేకపోవడం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో రోడ్లపై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మున్సిపల్ అధికారుల వేధింపులు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందకపోవడంతో ఆర్థికంగా తట్టుకోలేక ప్రైవేట్ ఫైనాన్స్ ఉచ్చులోపడి దోపిడీకి గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 చట్టం ప్రకారం ప్రతి మునిసిపల్ పట్టణంలో హ్యాకర్స్ జోన్స్ ఏర్పాటు చేసి , వారికి గుర్తింపు కార్డులు, ప్ప్రభుత్వం నుండి లక్ష రూపాయల రుణసౌకర్యం కల్పించాలని చట్టం లో ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జిల్లా కలెక్టర్ ఆధ్యర్యంలో హాకర్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం నుండి ప్రతి స్ట్రీట్ వెండర్స్ కు రూ లక్ష రూపాయలు రుణా సౌకర్యం కల్పించాలని, మున్సిపాల్టీ నుండి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Street wender act – 2014
సిఐటియు జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల రోడ్లపై తోపుడుబండ్లు చిరు వ్యాపారాలు చేసుకోనివ్వకుండా అభివృద్ధి పేరుతో ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. మున్సిపల్ అధికారులు గతంలో స్టిట్ వెండర్ల ను గుర్తించి గుర్తింపు కార్డులు ఇచ్చారు కానీ రెన్యువల్ చెయ్యడం లేదన్నారు. వెండర్ల కు కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నప్పటికి మున్సిపల్ అధికారులు వాటిని బేకాతార్ చేస్తూనిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైందికాదన్నారు.వెంటనే జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో వెండర్స్ తో వెండర్ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా రుణాలు అందించాలని కోరారు. లేని యెడల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తానని హెచ్చరించారు.
Street wender act -2014
ఈ కార్యక్రమంలో సిఐటియు టౌన్ కమిటీ సభ్యులు మల్లేష్ రాజ్ తోపుడుబండ్ల చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం కన్వీనర్ మెండే రమేష్ కో కన్వీనర్ శంకర్ సునీత పద్మ మధు ధానమ్మ లక్ష్మి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు