
Launch of a special edition of Jana Nirnayam : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా జన నిర్ణయం పత్రిక వెలువరించిన మహనీయుల మాసోత్సవల ప్రత్యేక సంచికను హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆవిష్కరించారు. ఏప్రిల్ నెలలో మహనీయుల జయంతి ఉత్సవాల నేపథ్యంలో బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లను స్మరించుకుంటూ ప్రత్యేక కథనాలతో సంచికను తీసుకురావడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పత్తిపాక గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల వెంకట రాజిరెడ్డి, ఎస్సి విభాగం జిల్లా కార్యదర్శి తుడుం మహేష్, పెద్ద కోడెపాక మత్స్య శాఖ వైస్ ప్రెసిడెంట్ ఐరబోయిన రాజు, మండల యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ముస్కుల నరేష్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి హైదర్, మండల నాయకులు శశికిరణ్ తదితరులతో పాటు జన నిర్ణయం ఎడిటర్ దామెర రాజేందర్ పాల్గొన్నారు.