Labor reforms – worker dissatisfaction around the world : ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో, ఆ మార్పుల భారం ప్రధానంగా కార్మిక వర్గంపైనే పడుతోందా అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ముందుకు వస్తోంది. 2026 ఫిబ్రవరి నెలలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చోటుచేసుకున్న సమ్మెలు ఈ ప్రశ్నను మరోసారి ముందుకు తెచ్చాయి. అర్జెంటీనా, అమెరికా యూరోప్ దేశాలు, ఇజ్రాయెల్, భారత్ తదితర దేశాల్లో ప్రభుత్వాలు చేపడుతున్న సంస్కరణలు, పైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు బహిరంగం గా పోరాటం ప్రారంభించాయి.
Labor reforms – worker dissatisfaction around the world
అర్జెంటీనా: చట్టం, ్పుGT సమ్మె, ప్రభావాలు : అర్జెంటీనా కార్మిక చట్టాల్లో విస్తృత మార్పులను ప్రతిపాదిస్తూ ఆ దేశ అధ్యక్షుడు జీaఙఱవతీ వీఱశ్రీవఱ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ రిఫార్మ్ బిల్ పార్లమెంట్లో కీలక దశకు చేరుకోగా, ఫిబ్రవరి 19న దేశవ్యాప్తంగా 24 గంటల సార్వత్రిక సమ్మె నిర్వహించడం ఉద్రిక్తతలను పెంచింది. అర్జెంటీనాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక చట్టంపై చర్చ కాదు. దేశ భవిష్యత్, ఆర్థిక దిశపై కార్మిక పోరాటంగా మారింది. పని గంటలను రోజుకు గరిష్టంగా 12 గంటల వరకు పెంచుకునే అవకాశం, “హవర్స్ బ్యాంక” విధానం పేరుతో అదనపు పని గంటలకు వెంటనే ఓవర్‌టైమ్ వెంటనే చెల్లించకుండా, భవిష్యత్తులో సెలవులుగా వినియోగించుకునే విధానం), సేవరెన్స్ పే వ్యవస్థలో మార్పులు, కంపెనీ స్థాయి ఒప్పందాలకు అధిక ప్రాధాన్యం, సమ్మె హక్కులపై పరిమితులు, ముఖ్యంగా ఆరోగ్యం, రవాణా, విద్య రంగాల్లో కనీస సేవలు తప్పనిసరి చేయడం దీనికి ముఖ్య కారణాలు. మిలే ప్రభుత్వం ఈ సంస్కరణలను “ఆర్థిక ఆధునికీకరణ”గా అభివర్ణిస్తోంది. 50 ఏళ్ల నాటి కఠిన కార్మిక చట్టాలు పెట్టుబడులకు అడ్డంకిగా మారాయి, లేబర్ మార్కెట్ సడలింపుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, విదేశీ పెట్టుబడులు ఆకర్షించవచ్చు, దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుందని వారి వాదన. కాన్ఫరేడషన్ జనవరల్ డీల్ ట్రాభాజో నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 11,12 తేదీల్లో బిల్లుకు వ్యతిరేకంగా సెనేట్ను ముట్టడించింది. శాంతి యుతంగా నిరసనలు తెలపుతున్న కార్మికులపై పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీ చార్జీ చేసారు. ఫిబ్రవరి 19న లోయర్ హౌస్‌లో బిల్లును పెట్టడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా 24 గంటల సార్వత్రిక సమ్మె నిర్వహించారు. సమ్మె ప్రభావం వల్ల దేశ రాజధాని బ్యూనస్ ఐరెస్లో రైళ్లు నిలిచిపోయాయి. బస్సులు, మెట్రో సేవలు ఆగిపోయాయి. ప్రభుత్వ ఎయిర్‌లైన్ ఏరోలీనియాస్ ఆర్జెంటీనాస్ 255 విమానాలను రద్దు చేసింది. వ్యవసాయ ఎగుమతులకు కీలకమైన రోసారియోపోర్ట్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అర్జెంటీనా ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణం, విదేశీ మారక సంక్షోభం, రుణ సమస్యలతో సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో కార్మిక చట్టాల మార్పులు సామాజిక ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉంది. ఈ పోరాటం కేవలం వేతనాల కోసం కాదు. ఇది అర్జెంటీనాలో భవిష్యత్ ఆర్థిక నమూనా ఏ దిశగా సాగాలి అన్న ప్రశ్నకు సమాధానం కోసం జరుగుతున్న రాజకీయ యుద్ధం. ఈ సంస్కరణల బిల్లు పూర్తిగా ఆమోదమైతే కార్మిక వర్గం బానిస వ్యవస్థలోకి నెట్టబడుతారు. ఇంకా పోరాటం కొనసాగుతున్నది.
Labor reforms – worker dissatisfaction around the world
అమెరికా : 4 వారాల నర్సింగ్ సమ్మె, డిమాండ్లు, ఫలితాలు అమెరికాలో నెలరోజులపాటు జరిగిన చారిత్రాత్మక సమ్మె ఫిబ్రవరి 23న ముగిసింది. ఖaఱsవతీ Pవతీఎaఅవఅtవ నర్సులు మరియు హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ 2026 జనవరి 26 న చేపట్టిన నాలుగు వారాల భారీ సమ్మెలో 31వేల మంది నర్సులు మరియు హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ కాలిఫోర్నియా, హవాయి రాష్ట్రాల్లో విదులు బహిష్కరించి పోరాటాల్లోకి వచ్చారు. ఈ సమ్మె జనవరి 26, 2026న ప్రారంభమైంది. నర్సులు మరియు ఆరోగ్య సిబ్బంది విధులను బహిష్కరించారు. యునైటెడ్ నర్సెస్ ఆసోసియోషన్ ఆఫ్ కాలిఫోర్నియా మరియు యూనియన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రోపేషనల్స్ యూనియన్లు ఈ సమ్మెకు నాయకత్వం వహించారు. సమ్మె యొక్క ప్రధాన డిమాండ్లు మొదటిది వేతనాల పెంపు, పని ఒత్తిడి, అధిక పనిభారం తగ్గించాలి, సరిపడ సిబ్బంది లేకపోవడం తో రోగుల భద్రతకు హామీ ఇవ్వలేకపోతున్నామని, ఉద్యోగ భద్రత, గౌరవం కల్పించాలని డిమాండ్లగా పెట్టారు. నెలరోజుల పాటు కార్మిక ప్రదర్శనలు, అనేక సభలు నిర్వహించారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఓపెన్-ఎండెడ్ నర్సుల సమ్మెగా నిలిచింది.
Labor reforms – worker dissatisfaction around the world
యూరప్ : బెల్జియం, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్ దేశాలలో కార్మికుల సమ్మెల ప్రభావం ఫిబ్రవరి 15న బెల్జియంలో దేశ 2026‘27 బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఇక్కడ కూడా ఈ సంస్కరణల వైపే అడుగులు పడుతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులు కఠినంగా ఉన్నాయని, ప్రజా వ్యయాలను తగ్గించడం అవసరమని, దీంతో ప్రాధాన్యతా రంగాలకు నిధులు మళ్లించాల్సి వచ్చిందని ప్రభుత్వ చెబుతున్నది. ఈ నేపథ్యంలో సాంస్కృతిక రంగానికి భారీగా నిధులు కొతలు పెట్టారు. మ్యూజియమ్స్, సంగీత, నాటక సంఘాలకు కేటాయింపులు కోతకు గురయ్యాయి. ప్రభుత్వ ఖర్చులను తగ్గించే చర్యలలో భాగంగా సాంస్కృతిక రంగానికి కేటాయించిన నిధులను తగ్గించారు. సబ్సిడీలను క్రమంగా కోత పెట్టడం లేదా కొన్ని ప్రాజెక్టులను నిలిపివేయడం జరిగింది. బెల్జియంలో కళా రంగం ఎక్కువగా ప్రభుత్వ సబ్సిడీలు, గ్రాంట్లపై ఆధారపడుతుంది. ఫిబ్రవరి 16-17, 2026 తేదీల్లో బెల్జియంలోని బ్రస్సెల్స్‌తో సహా పలు నగరాల్లో కళాకారులు ర్యాలీలు నిర్వహించారు. సాంస్కతిక రంగంలోని కార్మికులు పోరాట బాటపట్టారు. సాంస్కృతిక రంగ ఉద్యోగులు నిరసనలు ప్రారంభించారు మ్యూజియమ్స్, థియేటర్లు మూసివేతలు, స్టూడియోల ముందు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. థియేటర్ ప్రదర్శనలను నిరసనగా నిలిపివేశారు. “సంస్కృతి లగ్జరీ కాదు – అవసరం” అనే నినాదాలు దేశ వ్యాప్తంగా వినిపించాయి. ఫ్రాన్స్ విమాన సిబ్బంది సమ్మెలు : ఫాన్స్‌లో ప్రధాన విమాన సంస్థల ఉద్యోగులు ప్రభుత్వ ఆర్థిక మార్పులపై ఆందోళన వ్యక్తం చేయటం ప్రారంభించారు. ముఖ్యంగా వేతనాల పెంపు, పని గంటల పెరగడం, విమాన సేవలు రద్దులు, డ్యూటిలలో ఆలస్యం చేయడంతో ఫిబ్రవరి 18,19 తేదీల్లో ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు. గ్రీస్ ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమ్మె : ఫిబ్రవరి 14, 2026 గ్రీస్‌లో ఖర్చుల నియంత్రణ విధానాలపై ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె ప్రకటించారు. గతంలో కూడా ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలు అనేక ఆర్ధిక ఇబ్బందులనేదుర్కొన్నాయి. దీంతో ఇప్ప్పుడు కూడా అలా జరగడానికి వీలులేదని ఫిబ్రవరి 16-18, 2026 తేదిల్లో రవాణా సేవలు, ప్రభుత్వ కార్యాలయాలలో నిరసనలు, ర్యాలీలు, సమ్మెలు చేపట్టారు.
Labor reforms – worker dissatisfaction around the world
రైతుల గర్జన : ఫిబ్రవరి 13, 2026న గ్రీస్ రాజధాని ఏథెన్స్ మరోసారి భారీ రైతు నిరసనకు వేదికైంది. దేశం నలుమూలల నుండి వచ్చిన రైతులు తమ ట్రాక్టర్లతో నగర నడిబొడ్డున పార్లమెంట్ భవనం ముందు నిరసన చేపట్టారు. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, విదేశీ పోటీ, పెండింగ్ సబ్సిడీలు తదితర ప్రధాన సమస్యలపై వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ట్రాక్టర్లు నగరంలోకి ప్రవేశించగా ప్రజలు రహదారుల పక్కన నిలబడి చప్పట్లు కొట్టి రైతులకు సంఘీభావం తెలిపారు. పార్లమెంట్ ఎదుట ట్రాక్టర్లు వరుసగా నిలిపి, రాత్రంతా అక్కడే ఉండాలని రైతులు ప్రకటించారు. ఇది కేవలం ఒక నిరసన మాత్రమే కాకుండా, తమ బతుకుబండిని కాపాడుకోవాలనే పోరాటమని వారు స్పష్టం చేశారు. గ్రీస్‌లో రైతులు నిరసనలకు కార్మిక వర్గం అండగా నిలిచింది. రైతు సంఘాలు చేపట్టిన ప్రదర్శనలో కార్మిక వర్గాన్ని పెద్ద సంఖ్యలో సమీకరించి ప్రత్యక్షంగా పోరాటాంలో భాగస్వామిగా నిలచి రైతుల ఉద్యమంతో కలిసి పోరాటంలో పాల్గొన్నారు.
Labor reforms – worker dissatisfaction around the world
ఇజ్రాయెల్: షిప్పింగ్ రంగం సమస్య, ఉద్యోగ భద్రత. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ షిప్పింగ్ సంస్థ జిమి ఇంట్రిగ్రేటేడ్ షిప్పింగ్ సర్వీసెస్ ఉద్యోగులు జర్మనీకి చెందిన Haజూaస్త్ర-Lశ్రీశీyd తో విలీన ఒప్పందం చేసుకుంది. దీంతో Haజూaస్త్ర-Lశ్రీశీyd యాజమాన్యం ఉద్యోగులను తోలగించి కొత్త ఉద్యోగులను పెట్టుకుంటామని తెలిపింది. దీంతో కార్మికులంతా ఐక్యంగా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగారు. మొత్తం 1000 మందిలో మారు 800 మంది ఉద్యోగులు ఉద్యోగ భద్రత హామీని కోరుతూ పనులు నిలిపివేశారు. విలీనానంతరం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందనే భయంతో ఈ నిరసన ప్రారంభమైంది. ఈ సంఘటన గ్లోబల్ షిప్పింగ్ రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. భారత దేశంలో 4 లేబర్ కోడ్స్ రద్దు మరియు ఇతర ముఖ్యమైన డిమాండ్లపై కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఫిబ్రవరి 12న దేశ వ్యాప్తి సమ్మె నిర్వహించారు. హర్యాన పానిపట్ రిఫైనరి కార్మికుల ఆంధోళన, గుజరాత్ సురత్‌లో ఎల్ Ê టి కార్మికులు, కర్ణాటకలో, తెలంగాణలో ఆషా వర్కర్లు, గ్రామ పంచాయితీ ఉద్యోగులు పోరాటాలు, మహారాష్ట్రలో ఫారెస్ట్ వర్కర్లు ఇలా మొదలగు ఉద్యోగ కార్మిక వర్గం పోరాటాలు నిర్వహిస్తున్నారు. గ్లోబల్ లేబర్ ట్రెండ్, సామాజిక – ఆర్థిక ప్రభావం, రాబోయే విధానాలపై దృష్టి ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలు ఒక కొత్త దశలోకి ప్రవేశించాయి. ఇవి కేవలం వేతనాల కోసం చేసే సమ్మెలు కాదు. ఇవి ఉద్యోగ భద్రత, సామాజిక న్యాయం, మరియు ఆర్థిక సమానత్వం కోసం పోరాటాలు.ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, ప్రజాబాహుళ్యపు పోరాటాలు ఉధతమై పాలనవర్గ దోపిడీ విధానాలు తిప్పికొట్టబడతాయని ఆశిద్దాం.
- యాటల సోమన్న
- CITU రాష్ట్ర నాయకులు
- 9490098486
