
- కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన బాధితుని ఆరోపణ
- న్యాయం చేయాలని విజ్ఞప్తి
- ప్రాణహాని ఉంది రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకలు
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన ముదిగొండ సంతోష్ పోలీసులను కోరారు. తమకు ఇదే గ్రామానికి చెందిన దానబోయిన సతీష్ అను ఇరువురికి చెందిన భూమి విషయంలో గత ఏడాది నుండి గొడవలు జరుగుతున్నాయని, ఈ భూమి విషయమై గ్రామంలోని పెద్దమనుషుల సమక్షంలో చాలా సార్లు పంచాయతీలు నిర్వహించారని తెలిపారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పెద్దమనిషి పోలపల్లి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులు ముదిగొండ సతీష్ గతంలో పోలీస్ స్టేషన్లోనే తనపై దాడికి దిగిన సంఘటనలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురికి సంబంధించిన పొత్తుల భూమి విషయంలో వ్యవసాయ బావికి సంబంధించి బాట విషయంలో పలుమార్లు గొడవలు జరిగాయని గొడవకు సంబంధించి విషయాన్ని చాలా సార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగినదని పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన తనకు ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరగలేదని బాధితుడు సంతోష్ ఆవేదన వ్యక్తం చేశాడు. పొత్తుల వ్యవసాయ బావి నీటిని కేవలం దానమైన సతీష్ ఒక్కడే వాడు కుంటాడని మా ఊరికి సంబంధించిన పెద్దమనిషి పోలెపల్లి శ్రీనివాసరెడ్డి సపోర్ట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బావిలో గాని బావి దగ్గరకు పోవడానికి బాట విషయంలో గానీ అడగడానికి హక్కు లేదని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. తమ గ్రామానికి చెందిన పెద్దమనిషి పోలపల్లి శ్రీనివాసరెడ్డి బెదిరింపులకు పాల్పడుతూ తనను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని బాధితుడు ఆరోపించాడు. పోలెపెల్లి శ్రీనివాస్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఇప్పటికైనా పోలీసులు పట్టించుకోని తనకు తగు న్యాయం చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలంటే ఈ పెద్ద మనుషులే ఎమ్మెల్యే ముఖ్య అనుచరులుగా ఉండటం వల్ల తనకు అక్కడికి వెళ్లడానికి కూడా భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తగు చర్యలు చేపట్టి న్యాయం చేయాలని, ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి సామాన్యడినైనా తనకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.