
ఆసుపత్రిలో నిర్లక్ష్యం జరిగినా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు
రాజకీయ నేతలు, అధికారులు బంధన్ హాస్పిటల్ కు అన్నివిధాలా అండగా నిలుస్తున్నారని బాధితుడు జర్నలిస్టు కృష్ణ తీవ్ర ఆరోపణలు…
హనుమకొండలోని బంధన్ ఆసుపత్రిలో తనకు జరిగిన అన్యాయంపై అధికారులకు ఫిర్యాదు చేయగా చర్యలకు భయపడుతున్నారని బాధితుడు జర్నలిస్టు కృష్ణ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్యుడు ఆపరేషన్ సమయంలో,పోస్ట్ ఆఫ్ కేర్ లో నిర్లక్ష్యం వల్ల తాను ప్రాణాపాయ స్థితికి చేరుకొని నెలలపాటు మంచానికే పరిమితమయ్యానని వివరించారు. తనకు జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పట్ల బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బంధన్ ఆసుపత్రిలో జరిగిన తప్పిదానికి వైద్యులపై చర్యలు తీసుకోవాలని, ఆ హాస్పిటల్ నిర్వహణ పట్ల సమగ్రమైన విచారణ చేపట్టాలని, తనకు న్యాయం చేయాలని బాధితుడు జర్నలిస్టు కృష్ణ కోరారు.