
- “జన నిర్ణయం” కథనాలలే వాస్తవం…
- ఎట్టకేలకు కదిలిన ఐటిడిఎ అధికారులు…
- సోమ్లాతండా గిరిజన పాఠశాలలో విచారణ చేపట్టిన అధికారులు…
- సోమ్లాతండ టీచర్ విధుల నిర్వాహణలో లోటుపాట్లు ఉన్నాయని తేల్చిన ఎటిడబ్ల్యూఓ…
- “జన నిర్ణయం” వరుస వార్తాకథనాలే నిజమని తేలినట్లు తెలిపిన అధికారులు…
- సదరు టీచర్ కు స్థానచలనం చేస్తామని తెలిపిన ఎటిడబ్ల్యూఓ….
- “జన నిర్ణయం” పై కేసులు పెడతామని అవాకులు చవాకులు చేసిన ప్రబుద్ధులు ఇప్పుడేం సమాధానం చెప్తారంటున్న పలువురు….
- “జన నిర్ణయం” వార్తాకథనాలకు మద్దతుగా నిలిచిన విద్యార్థ, యువజన, ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు…
- నిజమే చెప్తాం…నిజమే రాస్తామని మరోసారి “జన నిర్ణయం” ప్రకటిస్తోంది….
నిజాన్ని చెప్పడమే “జన నిర్ణయం” నైజం. అదిరింపులు, బెదిరింపులు, కేసులు పెట్టడం, కేసులు పెడుతామని భయబ్రాంతులను చవిచూడటం “జన నిర్ణయం”కు కొత్తేమీ కాదు. నిజం వైపు నిలబడాల్సినోల్లే నిజం రాస్తున్న “జన నిర్ణయం”పై ఎదురుదాడికి, కుట్రలకు, బెదిరింపు ప్రణాళికలు చేయడం చూస్తూనే ఉన్నాం. ములుగు జిల్లా మల్లంపల్లి దగ్గరలోని సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాల వ్యవహారంలోనూ ఈ తతంగం సాగింది. వారికి అధికారులు స్పందించి అసలు నిజాన్ని చెప్పి జన నిర్ణయం కథనాలే నిజమని తేల్చడమే సమాధానం. ఈ పరిస్థితుల్లో జన నిర్ణయం కథనాలకు సంఘీభావం ప్రకటించిన విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలకు జన నిర్ణయం కృతజ్ఞతలు తెలుపుతోంది. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే “జన నిర్ణయం” నైజం అని మరోసారి ప్రకటిస్తోంది. అయితే సమస్య చిన్నగానే కనిపించవచ్చు. ఓన్లీ ఓ తండాల్లోని గిరిజన ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన చిన్న వార్తే కదా అని అనిపించవచ్చు. కానీ “జన నిర్ణయం” దృష్టి కోణంలో అదో గిరిజన విద్యకు సంబంధించినది. ఏండ్ల తరబడి ప్రభుత్వ వేతనం పొందుతూ గిరిజన విద్యను పట్టించుకోకపోవడం అంటే గిరిజన విద్యను నీరుగార్చడం కాక ఏమవుతుంది. అందుకే ఇది చిన్న సమస్య అనుకోవద్దని, గిరిజన విద్యకు సంబంధించినదని “జన నిర్ణయం” భావించింది. వరుస కథనాలు అందించింది.
ములుగు జిల్లా మల్లంపల్లి దగ్గరలోని సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న టీచర్ వ్యవహారంలో “జన నిర్ణయం” ప్రచురించిన వరుస వార్తాకథనాలే వాస్తవమైనాయి. ఎట్టకేలకు ఐటిడిఎ అధికారులు కదిలారు. సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాలను శనివారం సందర్శించి సమగ్రమైన విచారణ చేపట్టారు. సోమ్లాతండ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న టీచర్ విధి నిర్వాహణలో లోటుపాట్లు ఉన్నాయని ఎటిడబ్ల్యూఓ తేల్చి చెప్పారు. “జన నిర్ణయం” వరుస వార్తాకథనాలే నిజమని తేల్లిన ఐటిడిఎ అధికారులు సదరు టీచర్ కు స్థానచలనం చేస్తామని జన “నిర్ణయం ప్రతినిధి”కి వివరణ ఇచ్చారు. అయితే
“జన నిర్ణయం” పై కేసులు పెడతామని అవాకులు చవాకులు చేసిన ప్రబుద్ధులు ఇప్పుడేం సమాధానం చెప్తారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. “జన నిర్ణయం” కథనాలపై రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేసిన ములుగు జిల్లాలోని కొందరు సంఘాల పేరుతో, మీడియా పేరుతో సదరు టీచర్ కు వత్తాసు పలికి “జన నిర్ణయం” మీద కేసులు పెట్టాలని అతి ఉత్సాహం చూపిన వారు ఆత్మ పరిశీలన చేసుకోకుంటారో లేదో వారికే వదిలేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాల వ్యవహారంలో అధికారులు చెప్పిన విధంగా ఆ టీచర్ కు స్థాన చలనంమే కాకుండా సస్పెండ్ చేసి చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.
సోమ్లాతండా టీచర్ ను స్థానచలనం చేస్తాం :
ఐటిడిఎ ఎటిడబ్ల్యూఓ గుగుతోతు దేశీరాం
సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాల వ్యవహారంలో సదరు టీచర్ పై “జన నిర్ణయం” ప్రచురించిన వరుస కథనాల్లో వాస్తవం ఉందని తామ పరిశీనలో తేలిందని ఎటిడబ్ల్యూఓ పేర్కొన్నారు. వార్తాకథనాల నేపథ్యంలో శనివారం సోమ్లాతండా పాఠశాలలో విచారణ చేపట్టాం. విచారణలో టీచర్ విధుల నిర్వహణలో లోటుపాట్లు ఉన్నాయని తేలింది. ఈ నేపథ్యంలో సదరు టీచర్ కు స్థాన చలనం తప్పదు. త్వరలోనే సోమ్లాతండా టీచర్ కు ఇక్కడి నుంచి మరోచోటికి మారుస్తాం.
స్థానచలనంతోనే సరిపెడుతారా…?
సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సదరు టీచర్ పై విచారణ చేపట్టి ఆ టీచర్ విధుల నిర్వహణలో లోపాలు ఉన్నాయని చెప్తున్న అధికారులు స్థానచలనంతో సరిపెట్టుకుంటామని చెప్పడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానచలనంతోనే సరిపెట్టుకోవడం వేనుక అంతర్యం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. లోపాలను గుర్తించిన అధికారులు కేవలం స్థానచలనంతోనే సరిపెట్టుకుంటామని చెప్పడం వెనుక మతలాబేంటీ..? ఇలాంటి ప్రశ్నలకు ఐటిడిఎ అధికారులే సమాధానం చెప్పాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.