
పరకాల రూరల్ సీఐ రంజిత్ రావు, శాయంపేట ఎస్ఐ పరమేశ్వర్
Jananirnayam calendar inagaretion”: జన నిర్ణయం” దినపత్రిక 2025 క్యాలెండర్ ను పరకాల రూరల్ సీఐ రంజిత్ రావు, శాయంపేట ఎస్ఐ పరమేశ్వర్ శాయంపేట పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఆవిష్కరించారు. జన నిర్ణయం పత్రిక క్యాలెండర్ బాగుందని ప్రశంసించారు. ప్రజలకు ఉపయోగపడేలా సమాజానికి మేలు చేసే విధంగా వార్తాకథనాలు అందించడంలో ముందు వరుసలో ఉంటున్న “జన నిర్ణయం” పత్రిక మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. జన నిర్ణయం పత్రికలో వార్తలు నిస్పక్షపాతంగా రావడాన్ని స్వాగతించారు. ప్రజలు ప్రస్తుతం డిజిటల్ మీడియా యుగంలో ఉన్నారని, అలాంటి సమయంలో దిశ తక్కువ కాలంలోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందిన “జన నిర్ణయం” మరింత ఆదరణ పొందేలా కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా యజమాన్యానికి, రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. క్యాలెండర్ ఆవిష్కరణలో జన నిర్ణయం రిపోర్టర్ ఉప్పు నర్సయ్య ఉన్నారు.