
Jananirnayam calendar inagaretion “జన నిర్ణయం” తెలుగు దినపత్రిక 2025 క్యాలెండర్ ను ప్రముఖ వైద్యనిపుణులు “డాక్టర్ జేయుడు” ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా నర్సంపేట లో warangal district narsampet జన నిర్ణయం రిపోర్టర్ నర్సంపేట ఆర్సీ ఇంఛార్జి “కన్నం వెంకన్న” ఆధ్వర్యంలో ఆసుపత్రి సిబ్బందితో కలిసి “డాక్టర్ జేయుడు” తన ఆసుపత్రిలో ఆవిష్కరించారు. జన నిర్ణయం పత్రిక తనదైన శైలిలో ముందుకు సాగుతున్నదని అభిప్రాయపడ్డారు.
ప్రజల సమస్యలను వెలికితీయడంలో ముందు వరుసలో ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో మరింత కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా యూగం ఒరవడి కొనసాగుతున్న నేపథ్యంలో “జన నిర్ణయం” పత్రికతో పాటు, వెబ్సైట్ కూడా సమాచార వారధిగా ఉండటం స్వాగతించాల్సిన అంశం అన్నారు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలుగా ఉండే పత్రికా రంగంలో జన నిర్ణయం తమదైన శైలిలో ముందుకు సాగుతున్నదని భవిష్యత్తులోనూ మరింత అభివృద్ధి చెంది ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు.