Jananirnayam calendar inagaretion వరంగల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో “జన నిర్ణయం” క్యాలెండర్ ను INTUC శాయంపేట మండల అధ్యక్షుడు “మారెపల్లి రాజేందర్” ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. ప్రజల సమస్యలను వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జన నిర్ణయం పత్రిక ముందుంటుందని భవిష్యత్తులో మరింత ప్రజాదరణ పొందాలని మారెపెల్లి రాజేందర్ అన్నారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా యూగం ఒరవడి కొనసాగుతున్న నేపథ్యంలో “జన నిర్ణయం” పత్రికతో పాటు, వెబ్సైట్ కూడా సమాచార వారధిగా ఉండటాన్ని స్వాగతించాల్సిన పరిణామం అని అన్నారు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలుగా ఉండే పత్రికా రంగంలో జన నిర్ణయం తమదైన శైలిలో ముందుకు సాగుతున్నదని భవిష్యత్తులోనూ మరింత అభివృద్ధి చెంది ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల రవిపాల్ తహరాపూర్ మాజీ సర్పంచ్ సదయ్య, జన నిర్ణయం శాయంపేట మండలం రిపోర్టర్ ఉప్పు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.