
Jananirnayam calendar inagaretion: “జన నిర్ణయం” తెలుగు దినపత్రిక 2025 క్యాలెండర్ ను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి Ex mla challa Dharma Reddy శనివారం ఆవిష్కరించారు. జనం పత్రికగా “జన నిర్ణయం” ముందుకు ముందుకు సాగడం అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలను వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మరింత కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా యూగం ఒరవడి కొనసాగుతున్న నేపథ్యంలో “జన నిర్ణయం” పత్రికతో పాటు, వెబ్సైట్ కూడా సమాచవారధిగా ఉండటాన్ని స్వాగతించాల్సిన అంశం అన్నారు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలుగా ఉండే పత్రికా రంగంలో జన నిర్ణయం తమదైన శైలిలో ముందుకు సాగుతున్నదని భవిష్యత్తులోనూ మరింత అభివృద్ధి చెంది ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు. జన నిర్ణయం ఎడిటర్ రాజేందర్ దామెర (దారా ), రిపోర్టర్ అమరేందర్ రెడ్డితో పాటు మిద్దెపాక రవీందర్, బొట్ల నరేష్, జన్ను రాములు, తదితరులు పాల్గొన్నారు.