
క్యాలెండర్ ఆవిష్కరించిన పరకాల ఏసీపీ సతీష్ బాబు
వాస్తవ కథనాలకు కేరాఫ్ గా నిలుస్తున్న “జన నిర్ణయం” పత్రిక మరింత ప్రజాదరణ పొందాలని పరకాల ఏసీపీ సతీష్ బాబు ACP Sathish Babu అన్నారు. శుక్రవారం జన నిర్ణయం క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలుగా ఉంటాయని, అలాంటి పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలువడంలో నిక్కచ్చిగా నిలబడాలని అన్నారు. వాస్తవ కథనాలు అందించడంలో తమదైన పాత్ర పోషిస్తున్న “జన నిర్ణయం” పత్రికను అభినందించారు. జన నిర్ణయం క్యాలెండర్ బాగుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి వైస్ ఛైర్మన్ మారెపెల్లి రవీందర్ (బుజ్జన్న) జన నిర్ణయం రిపోర్టర్ ఉప్పు నర్సయ్య పాల్గొన్నారు.