
- వైద్యం వికటించిన మహిళా ఉదాంతంతో జోరుగా సాగుతున్న చర్చలు….
- వెలుగు చూడని ఘటనలు ఉన్నాయనే ఆరోపణలు…
- అధికారుల అండ, పొలిటికల్ సపోర్ట్ ఉందనే ధీమాలో స్రవంతి హాస్పిటల్ యాజమాన్యం…
- తక్షణమే “స్రవంతి హాస్పిటల్” పై చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా డిఎం అండ్ హెచ్ఓ కు పలువురి ఫిర్యాదు
Is treatment at “Sravanthi” hospital dangerous : ములుగు జిల్లా కేంద్రంలోని “స్రవంతి” ఆసుపత్రిలో వైద్యం యమ డేంజర్ గా మారిందనే ప్రచారం సాగుతోంది. వైద్యం వికటించిన మహిళా ఉదాంతంతో జోరుగా ఆ ఆసుపత్రిలో వైద్యం పట్ల అనుమానాలు బలపడుతున్నాయి. జన నిర్ణయం వెలువరించిన బాధిత మహిళా ఉదాంతమే కాకుండా వెలుగు చూడని ఘటనలు కూడా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ములుగు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక వైద్యం పొంది డిశ్చార్జి అయిన మూడు రోజుల్లోనే మృతి చెందిన ఘటన ఉందనే చర్చలు వినిపిస్తున్నాయి. దీంతో స్రవంతి హాస్పిటల్ వైద్యం యమ డేంజర్ అనే వాదనలకు బలం చేకూరుతుందనేది గమనార్హం.
Is treatment at “Sravanthi” hospital dangerous
అయితే స్రవంతి హాస్పిటల్ నిర్వాహకులు మాత్రం అధికారుల అండ, పొలిటికల్ సపోర్ట్ ఉందనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకనుగునంగానే చోటా మోటా లీడర్లు సైతం మంత్రి సపోర్ట్ ఉందని, సీఎం సలహా దారుణానికి దగ్గరని, అత్యంత నీతివంతమైన వైద్యుల చేసిన వైద్యం ఎలా ఫెయిల్యూర్ అవుతుందని వత్తాసుపలుకుతుండటం స్రవంతి హాస్పిటల్ నిర్వాహకులకు పొలిటికల్ సపోర్ట్ పుష్కలంగానే ఉందనటాన్ని బలపరుస్తుంది. ఏది ఏమైనప్పటికీ తక్షణమే “స్రవంతి హాస్పిటల్” పై చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా డిఎం అండ్ హెచ్ఓ కు పలువురి ఫిర్యాదు చేయటం చర్చానీయాంశంగా మారింది.
Is treatment at “Sravanthi” hospital dangerous
స్రవంతి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని
డిఎం అండ్ హెచ్ఓ కు ఫిర్యాదు
ములుగు జిల్లా కేంద్రంలోని స్రవంతి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డిఎం అండ్ హెచ్ఓ) డాక్టర్ గోపాల్ రావుకు పలువురు ఎమ్మార్పీఎస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని స్రవంతి హాస్పిటల్ ల్లో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులు రెంటాల బిక్షపతి, మేకల మహేందర్, సురేష్, నరేష్ తదితరులు బృందం డిఎం అండ్ హెచ్ఓ కు వినతి పత్రం అందజేశారు. కనీస సౌకర్యాలు లేకుండా ఎలాంటి ల్యాబ్స్ పరీక్షలు చేయకుండా ప్రపంచ స్థాయి వైద్యం అందిస్తున్నామని, అత్యాధునిక పరికరాలు ఉన్నాయని నమ్మబలుకుతూ యధేచ్ఛగా వైద్య వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.
Is treatment at “Sravanthi” hospital dangerous
దళిత గిరిజన పేద మధ్య మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తూ నాసిరకం వైద్యం అందిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న స్రవంతి హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటివల ఓ మహిళకు వైద్యం వికటించిన ఉదాంతం చర్చానీయాంశంగా మారిందని, గత వారం కిందట నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక స్రవంతి ఆసుపత్రిలో చికిత్స పొందిన మూడు రోజులకే మృతి చెందిన ఘటన ఉందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మరుగునపడ్డవి ఎన్నో ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తక్షణమే స్రవంతి హాస్పిటల్ పై సమగ్రమైన విచారణ చేపట్టి ఆ హాస్పిటల్ ను సీజ్ చేయాలి డిమాండ్ చేశారు.
Is treatment at “Sravanthi” hospital dangerous
సమగ్రమైన విచారణ చేపట్టాలి
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అమ్జద్ పాషా
స్రవంతి హాస్పిటల్ పై వస్తున్న ఆలోపణ పట్ల తక్షణమే సమగ్రమైన విచారణ చేపట్టాలి. ఆ ఆసుపత్రి పర్మిషన్ విషయంలోనూ, అక్కడ జరుగుతున్న వైద్యం విషయంలోనూ విచారణ చేపట్టాలి. ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల అర్హతపై కూడా విచారణ చేపట్టాలి. వైద్యం వికటించిన ఉదాంతం చర్చానీయాంశంగా మారుతోంది. ఆసుపత్రిలో సౌకర్యాలు కూడా నిబంధనల ప్రకారం లేవనే ఆరోపణల వినిపిస్తున్నాయి. తక్షణమే సమగ్రమైన విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలి.