
- “డిటిసి”కి అండగా నిలుస్తున్న అధికారులు…!
- జిల్లా మొత్తం ఫీల్డ్ వర్క్ చేయాల్సిన డిటిసి ఇంటికే పరిమితం…
- రాష్ట్ర మొత్తం ఒక రూల్ హనుమకొండ డిటిసి కి కొత్త రూల్…!
- జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలంటున్న పలువురు…
Is he the king of “DRDA” : హనుమకొండ జిల్లా డిఆర్డిఏ ఆఫీసులో డిస్ట్రిక్ట్ టెక్నికల్ సెల్ (డిటిసి) అధికారుల అండతో ఆఫీసుకు రాకుండా ఆఫీసులో సమస్యలు సృష్టిస్తూ అధికారులందరినీ గందరగోళపరుస్తూ ఆ సమస్యను పరిష్కారం అతనే చేస్తూ పై అధికారులను కిందిస్థాయి అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆఫీస్ కు టైంపాస్ కి వచ్చి వెళ్లే తరహాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఆఫీస్ కి వచ్చిన అందరు ఇంటికి ప్రయాణం అయ్యే సమయంలో మీటింగ్ అని పెట్టి కింది స్థాయి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం.
Is he the king of “DRDA”?
ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అర్హత లేని డిటిసి కింది స్థాయి ఉద్యోగులపై అధికారులకు తెలిసే ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. గతంలో హనుమకొండ పరిధిలో మండలంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గా (ఈసి) విధులు నిర్వహించిన అతనికి విద్య అర్హతలు లేకున్నా డిటిసిగా ఉన్నతాధికారుల అండదండలతోనే జరుగుతుందని ప్రచారం ఉంది. అతనికంటే సీనియర్లు సివిల్ ఇంజనీరింగ్ పట్టా ఉన్న అధికారులను పక్కన పెట్టి ఎలాంటి నియమ నిబంధన లేకుండా అతనిని డిటిసిగా నియమించి అధికారుల పూర్తి మద్దతును తెలియజేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. హనుమకొండ డిఆర్డిఓ ఆఫీసులో డిటిసిగా చలమనీ అవుతున్న అధికారిపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.